టాలీవుడ్‌లోని పాపులర్ నిర్మాణ సంస్థల్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకటి. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు పలు చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. ఇప్పటికే స్వరూప్ ఆర్ఎస్జె డైరెక్షన్లో ప్రొడక్షన్ నంబర్ 8ను ఆ సంస్థ ప్రకటించింది. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా పరిచయమైన స్వరూప్ తన డెబ్యూ ఫిల్మ్‌తోటే ఇటు విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు, అటు మంచి కమర్షియల్ హిట్‌నూ సాధించారు.
స్వరూప్ ఆర్ఎస్జె డైరెక్షన్లో నిర్మిస్తోన్న చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో యంగ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. స్వరూప్‌కు అన్వేష్ రెడ్డి, రాహుల్ యాదవ్ సంయుక్తంగా సినిమా స్క్రిప్టును అందజేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా క్లాప్ నివ్వగా, ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘మిశన్ ఇంపాజిబుల్’ (Mishan Impossible) అనే ఆసక్తికర టైటిల్‌ను ప్రకటించారు. తిరుపతి సమీపంలోని ఓ గ్రామంలో నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో హనుమంతుడు, శివుడు, శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ముగ్గురు పిల్లల చేతుల్లో గన్స్ ఉండటం చూస్తే, ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. ఇంగ్లీష్ టైటిల్లో మొదటి పదం ‘Mission’లో ‘sio’ అక్షరాలను క్రాస్ చేసి, వాటి పైన ‘ha’ అక్షరాలను పెట్టడం, పోస్టర్ క్రేజీగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే ఆసక్తి కలుగుతోంది.
పోస్టర్లో కనిపిస్తున్న ముగ్గురు పిల్లలతో పాటు, మరో రెండు ముఖ్య పాత్రలు ఈ సినిమాలో ఉంటాయి. త్వరలో హీరో హీరోయిన్లను ప్రకటించనున్నారు.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్.ఎమ్. పాషా అసోసియేట్ ప్రొడ్యూసర్. మార్క్ కె. రాబిన్ సంగతం సమకూరుస్తుండగా, దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.