నటి విజయశాంతి రాజకీయ జీవితం ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. బాక్స్ ఫీస్ సక్సెస్ స్టోరీలన్నీ బ్యాలెట్ బాక్స్ దగ్గిర సక్సెస్ కావని ఆమెరాజకీయ జీవితం కూడా రుజువు చేసింది. ఎన్టీయార్ తోనే సినీనటుల రాజకీయ యుగం ముగిసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి చాలా మంది వచ్చారు. పోయారు. వస్తున్నారు, పోతారు కూడా. ఎవరూ నిలబల్లేదు.
సినిమా రంగంలో వారికి వచ్చిన కిరీటాలు, బిరుదులు, అవార్డులు రాజకీయాల్లోపైసాకు పనికిరాకుండా పోయాయి. శివాజీ గణేశన్ నుంచి పవన్ కల్యాన్ దాకా ఎవరికీ వారి భారీ ఫ్యాన్ పోలోయింగ్ వల్ల గాని, గ్లామర్ వల్ల రాజకీయ ప్రయోజనం చేకూరలేదు.
కారణం ఎన్టీయార్, ఎమ్జీ యార్ లలో ఉన్న ఒరిజినల్ ఐడియాలు వీళ్లలో ఎవరికీ లేకపోవడమే. వాళ్చిచ్చిన నినాదలు అంతకు ముందు ఎవరూ ఇవ్వలేదు. అందుకే వాటి వశీకరణ శక్తిలో ప్రజలంతా పడిపోయారు. బహుశా ఆ కాలపు సామాజిక పరిస్థితులు కూడా ఈ మహానటులకు ఉపయోగపడి ఉండవచ్చు. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా సినీనటుల బ్యాలెట్ బ్యాక్స్ స్టోరీలన్నీ చివరకు ఫెయిల్యూర్ స్టోరీలుగా ముగిశాయి.
విజయశాంతి 1998లో బిజెపి చేరారు. ఆపుడామెకు,ఎవరిచ్చారో తెలియదుగాని, ఎన్నిబిరుదులున్నాయో. సౌత్ ఇండియ అమితాబ్ బచ్చన్, లేడీ అమితాబ్ బచ్చన్ అనేదిఆమెకున్న పెద్ద పేరు. రెవల్యూషన్ కు, మహిళా శక్తి, తిరుగుబాటుకు ఆమె క్యారెక్టర్లు ప్రతీక. ఆ కీర్తితో ఆమె బిజెపిలో చేరారు.
అపుడు వాజ్ పేయి నాయకత్వం లో ఎన్ డిఎ ప్రభుత్వం ఉండింది. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకటే టాక్, కాంగ్రెస్ యుగం అంతరించింది, బిజెపి యుగం మొదలైంది అని. అలాంటపుడు ఆమె బిజెపిలో చేరడమంటే ఏమిటి? గాలి వాటం చూసుకున్నారనేగా. చేరారు.
ఆమెకు ఒక ధ్యేయంగాని, అవగాహన గాని ఏమీలేదు. బిజెపి లో ఫ్యూచర్ లో ఉంటుందనుకుని చేరారు.ఫీల్డ్ మారారు. అక్కడ ఆమేకేమీ గుర్తింపు రాలేదు. కాషాయ పార్టీ స్టార్ గా బిజెపి ఆమెను చూల్లేదు. కాకపోతే, ఒకటి రెండు సార్లు స్టార్ క్యాంపెయినర్ ని చేసింది.
సౌత్ ఇండియా అమితాబ్ బచ్చన్ అనే హోదా వల్ల ఆమెకు రాజకీయాల్లో ఎలాంటి పట్టు దొరకలేదు. ఎన్ డి ఎ రోజుల్లో ‘మైనారిటీ బిజెపి’ స్టార్ల కోసంఎదురు చూస్తూ ఉంది. కాబట్టి పార్టీలోకి వస్తానంటే విజయశాంతిని ఎవరూ వద్దంటారు? అలా ఆమె బిజెపి లో చేరారు. అక్కడే ఆమె ఫెయిల్యూర్ మొదలయింది. ఆమె నాయకత్వం లక్షణాలు లేవని, ఆమె ఎవరి నాయకత్వంలోనో పనిచేయాలనుకుంటున్నారని అర్థమవుతుంది. అక్కడే ఎన్టీయార్ స్వతంత్ర వ్యక్తిత్వం కనిపిస్తుంది. ‘మరొకరి బాటలో నడవాలనుకోవడమేమిటి, నేను కొత్తదారి వేసుకుంటా’ నని దూసుకుపోయాడాయన.
బిజెపిలో చేరాక ‘హిందీ పార్టీ’ లో తెలుగు నటి ఫెయిల్ అయ్యారు. బయటపడకపోతే, రాజకీయంగా ఫ్యూచర్ లేదు. అలాంటపుడే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉద్యమం మొదలయింది. ఆమె ‘జైతెలంగాణ’ అన్నారు. సొంతంగా కొద్దిరోజులు, కెసిఆర్ కోరస్ కలిపి ఇంకొన్నాళ్లు ఆమె ‘జై తెలంగాణ ’ అన్నారు.
వన్ ఫైన్ మార్నింగ్, కెసిఆర్ స్థాపించిన టిఆర్ ఎస్ లో చేరడమే మంచిదనుకున్నారు.చేరారు. ఎంపి అయ్యారు. అయితే, దానితో ఆమె ఫెయిల్యూరో రెండో అంకం మొదలయింది.
టిఆర్ ఎస్ నుంచి బయటపడ్డారు. కారణమేదయినా కావచ్చు, ఆమె టిఆర్ ఎస్ లో ఫెయిల్. కుట్రలవల్ల టిఆర్ ఎస్ లో ఉండలేకపోయానని అందుకే బయటకు వచ్చానని చెప్పారు. కుట్రల్లేని రాజకీయాలెక్కడయినా ఉంటాయా?
తర్వాత ఆమె కాంగ్రెస్ కు వచ్చారు. టిఆర్ ఎస్ ఎంపిగా ఉంటూ 2014 ఫిబ్రవరిలో ఆమె సోనియాగాంధీనాయకత్వంలోని కాంగ్రెస్ లో చేరారు. 2014 లో ఆమెకున్న పొలిటికల్ స్టార్ పవర్ కు మొదటి పరీక్ష జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆమెను మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ పెట్ట్టింది. 2009లో ఆమె టిఆర్ ఎస్ క్యాండిడేట్ గా మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు.నెగ్గారు. దీనికి తెలంగాణ ఉద్యమమే కారణమని వేరే కెప్పాల్సిన పనిలేదు. ఎమ్మెల్యేగా ఇపుడామె సొంత ఆకర్షణ శక్తిని నిరూపించుకోవాలి. కాని ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇది ఫెయిల్యూర్ సీరీస్ లో మరొక అధ్యాయం.
2019 ఎన్నికలకు గాను ఆమెను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించారు. అంతేకాదు, తెలంగాణ ఎలెక్షన్ క్యాంపెయిన్ కమిటీకి సలహా దారుగా నియమించారు. 2019 లో ఏమయిందో అందరికీ తెలుసు. విజయశాంతి ఫెయిల్యూర్ పంరపరంలో ఇదొకటయింది. తెలంగాణ జనంమీద ఆమె క్యాంపెయిన్ పనిచేయలేదు.
ఈ మధ్యలో మరొక ఫెయిల్యూర్ పిట్టకథ గురించి చెప్పుకోవాలి. ఆమె తమిళనాడులో ఒకపుడు బిజెపికి స్టార్ క్యాంపెయినర్ , సరేఅది 2005 ముందటి పెయిల్యూర్ కథ.
అయితే, బిజెపి నుంచి బయటకు వచ్చాక, టిఆర్ ఎస్ లో చేరక ముందు ఒకమరొక ఫెయిల్యూర్ కథ ఉంది. ఆమెకు తెలంగాణ నినాదం రాజకీయంగా పనికొస్తుందనుకున్నారు. వెంటనే ‘తల్లి తెలంగాణ’ అనే పార్టీ పెట్టారు. ఆమె తన తెలంగాణ రూట్స్ డిస్కవర్ చేసి తెలంగాణ అడపడచుగా అవతారమెత్తారు. అయితే, తల్లి తెలంగాణపార్టీని ముందుకు తీసుకెళ్ల లేకపోయారు. 2009 ఎన్నికల ముందు దానిని టిఆర్ ఎస్ లో విలీనం చేశారు. ఇదొక పెద్ద ఫెయిల్యూర్.
ఇంత ఫెయిల్యూర్ బరువుతో ఆమె ఇపుడు బిజెపిలో చేరారు. దీనితో ఆమె రాజకీయ చక్రం ఫుల్ రౌండ్ తిరిగింది. ఈ బిజెపిలోనయినా నెగ్గుకొస్తుందేమో చూడాలి. ఆమె ఆ రోజులో బిజెపిలో చేరిన ఒక పాత పోటో నాటి హోంశాఖ సహాయమంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు షేర్ చేశారు. నిజానికి అపుడు విజయశాంతిని బిజెపిలోకి తీసుకురావడంలో ఆయనే కీలకపాత్రపోషించారని చెబుతారు.
బిజెపి రెండో ఇన్నింగ్స్ లో ఆమె పార్టీ స్టార్ గా వెలిగిపోతారా లేక స్టార్ క్యాంపెయినర్ గా మిగిలిపోతారా?