ఇండియా పాకిస్తాన్ యుద్ధం సరిగ్గా 50 సంవత్సరాల కిందట ఇదే రోజున అంటే 1971 డిసెంబర్ 3న మొదలయింది.
ఈ యుద్ధం వల్లే అప్పటి తూర్పుపాకిస్తాన్ బంగ్లా దేశ్ గా అవతరించింది.
డిసెంబర్ 16 దాకా ఈ యుద్ధం కొనసాగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు, ఇస్లామిస్టు తీవ్రవాదులు బంగ్లాదేశ్ లో బీభత్సం సృష్టించారు.
సుమారు 20 వేల నుంచి 40 వేల మంది దాక బంగ్లామహిళల మీద అత్యాచారం చేశారు.
ఈ ఇస్లామిస్టు తీవ్రవాదలను కూడా రజాకార్లు అనే పిలిచేవారు. నైజాం సంస్థానం విలీనానికి ముందు తెలంగాణప్రాంతాంలో హత్యాకాండ జరిగింది. దీనికి ఖాసిం రజ్వీనాయకత్వంలోని మూకలే కారణ. వాళ్ల పేరే రజాకార్లు. చరిత్రలో మరొక సారి మనక రజాకార్లు కనిపించింది బంగ్లాదేశ విముక్తి యుద్ధ సమయంలోనే.
1971డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోయింది. ఈ ఫోటో నాటి లొంగుబాటు ఒప్పందం మీద పాక్ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ నియాజి సంతకం చేస్తున్నప్పటిది. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ ఆరోరా సంతకం చేశారు. అపుడు 11 భారతీయ నగరాల మీద పాకిస్తాన్ వైమానిక దాడులు జరపడంతో యుద్ధం మొదలయింది.