జిహెచ్ఎంసి మొన్న జరిగిన సాధారణ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లూ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటిచింి. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బ్యాలెట్ పేపర్లను లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదయిన సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలో 74 లక్షల 67,256 ఓట్లు ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
కౌంటింగ్ ఏర్పాట్లు ఇవే:
* మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152
* 31 మంది కౌంటింగ్ పరిశీలకులు
* ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు
* 1 హల్ కి 14 టేబుల్స్ ఉంటాయి.
* ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు…
* కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు
* 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు
* ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది…
* అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది…
* ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు…
* 1 రౌండ్ కి 14,000 వేల ఓట్లు లెక్కింపు
* అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది…
* ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు…
* బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను కౌంట్ చేస్తారు