అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిప్రకటించిన నూతన ఇసుక విధానానికి వ్యతిరేకంగా చంద్రబాబు అధ్యక్షతనఅమరావతిలో నిరసన ప్రదర్శన జరిగింది.
తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీ చేసుకుంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.
ఇసుక ధరలు పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
గతంలో తెలుగు దేశం హయాంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని అచ్చెన్నాయుడు, శాసనసభాపక్ష ఉపనేత విమర్శించారు.
తెలుగుదేశం నేతలు ఇంకా ఏమన్నారంటే…
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వల్ల 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారింది
టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుకను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించారు
పనుల్లేక భవననిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవన్నీ ప్రభుత్వ హత్యలే.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం అవినీతి విధానం అని పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారు
కొత్త విధానం పై ముఖ్యమంత్రి, మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు
సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారు
ఇప్పటికైనా మనస్సుమార్చుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేయాలి
18నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్ కి వెళ్ళింది
ఇసుక మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతోంది
నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు
నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారు.
దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే ఉచిత ఇసుకను అమలు చేయట్లేదు.
భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేశారు
రాష్ట్రంలో ఎవ్వరూ ఇళ్ల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొంది.