శబరిమల ప్రసాదం డోర్ డెలివరీ, పోస్టల్ శాఖ ప్రయోగం సక్సెస్

శబరిమల  అయ్యప్ప స్వామివారి ప్రసాదాన్ని స్పీడు పోస్టు ద్వారా భక్తులకు డోర్ డెలివరీ  చేయాలని పోస్టల్ డిపార్ట్ మెంటు  నిర్ణయించింది.  సమీపంలోని ఏ పోస్టాఫీసునుంచైనా భక్తులు ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. ఒక పాకెట్ ప్రసాదం ధర రు. 450. దేశంలోని ఏ మూలన ఉన్నా భక్తులకు ఈ ప్రసాదం అందించేందుకు పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోస్ట ల్ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.
“ Keeping in view devotees across the country, department of posts conceptualized and developed a comprehensive booking and delivery package for the delivery of the “ Swamy Prasadam” of Sabarimala Temple at the doorstep of the devotees using the vast network of postal department covering every nook and corner of the country,” అని పోస్టల్ శాఖ పేర్కొంది.
దీనికోసం కేరళ పోస్టల్ సర్కిల్ ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రసాదం పార్సిల్ లో అప్పం, అరవన, విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం ఉంటాయి. ప్రతి భక్తుడు పది పాకెట్ల ప్రసాదం దాకా బుక్ చేసుకోవచ్చు.ఆప్పం గట్టిగా ఉండే తీయటి అన్నం ముద్ద.దీనిని కదళీఫలం, నెయ్యితో (అరటిపండు)తో చేస్తారు. అరవన అంటే చిక్కెటి బెల్లం పాయసం వంటిది.

 

నవంబర్ 6 నుంచే ఈసర్వీసు మొదలయింది. దీనిని మాంచి స్పందన వచ్చింది. ఇప్పటిదాకా 9 వేల అర్డర్లు బుక్ అయ్యాయి. అర్డర్లు రోజురోజుకు  పెరుగుతున్నాయని పోస్టల్ శాఖ పేర్కొంది. నవంబర్ 16 నుంచి  శబరమలై ఆలయానికి మండలం  యాత్రకు భక్తులను అనుమతిస్తున్నారు. కోవిడ్ పాండెమిక్ వల్ల ఆలయాన్ని మార్చిలో మూసేయాల్సి వచ్చింది. దాదాపు ఏడు నెలల పాటు ఆలయం భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇపుడు కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను కోవిడ్ నియమాల ప్రకారం అనుమతిస్తున్నారు.
ఇపుడు పరిమిత సంఖ్యలోనే భక్తులను కోవిడ్ నియమాల ప్రకారం అనుమతిస్తున్నారు.   మామూలు రోజుల్లో వేయి మంది, శని ఆది వారాలలో రెండు వేల మంది, పర్వదినాలలో అయిదు వేల మందిని అనుమతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *