తిరుమల శ్రీవారి సన్నిధిలో “వైకుంఠ ఏకాదశి” ద్వాదశి” నాడు కేవలం సామాన్య భక్తులను,తిరుమల తిరుపతి స్థానికులను, టిటిడి ఉద్యోగస్తులను అనుమతించేలా ఏర్పాటు చేయండని, విఐపి రద్దీ తగ్గించడని తిరుపతి యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు
వైకుంఠ ఏకాదశి,ద్వాదశి రెండు రోజులు”విఐపి బ్రేక్” “శ్రీ వాణి ట్రస్ట్” దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల స్పెషల్ ఆఫీసర్ ప్రకటించి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలి!
కావాలంటే, వైకుంఠ ఏకాదశి,ద్వాదశి తర్వాత మూడవరోజు నుంచి ప్రజా ప్రతినిధులను,ప్రోటోకాల్ పరిధి అధికారులను,ధర్మకర్తల మండలి సభ్యులు బంధువులను,టీటీడీ ఉన్నతాధికారులు వారి స్నేహితులను, సెలబ్రిటీలను,బడా పారిశ్రామికవేత్తలను మిగిలిన ఎనిమిది రోజులు అనుమతించ్చవచ్చని, ఈ మేరకు తిరుమల అధికారులు ప్రకటన చేసేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
నవీన్ లేవనెత్తిన మరిన్ని ముఖ్యాంశాలు:
వివిధ రాష్ట్రాలలో ఉన్న పీఠాధిపతులకు మఠాధిపతిలకు ఎన్నడూ లేని విధంగా లేఖలు రాసి వారి అనుమతితోనే తిరుమలలో సాంప్రదాయ పద్ధతిలో “రెండు” రోజులు తెరిచే వైకుంఠ ద్వారాలను “పది” రోజులు తెరిచేందుకు సన్నద్ధం అవుతున్నామని అధికారలు ప్రకటించారు!
ఆగమ శాస్త్ర, పాంచరాగ శాస్త్రంలో ఎక్కడ పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరవకూడదు అని చెప్ప లేదంటూ చాలా జాగ్రత్తగా టిటిడి అధికారుల బాధ్యతలు గుర్తుచేస్తూ మఠాధిపతులు, పీఠాధిపతులు లేఖలు ఇచ్చారు!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులకు, అర్చకులకు,ఉద్యోగస్తులకు, స్థానికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు టీటీడీ తీసుకుంటారని ఆశిస్తూ వీరంతా టీటీడీ అధికారుల,ధర్మకర్తల మండలి కోరిక మేరకు ఈ లేఖలు ఇచ్చారు.
వైకుంఠ ద్వారాలు తెరిచేందుకు ఇంత ఉత్సాహంగా మఠాధిపతులు, పీఠాధిపతులే లేఖలురాయడం ఆశ్చర్యం.
గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శ్రీవారి నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించినప్పుడుగాని, శ్రీవారి సన్నిధిలో కైంకర్యాలు, ఆభరణాల విషయంలో భక్తులకు అనుమానాలు కలిగినప్పుడుగాని, వీరెవరూ పట్టించుకోలేదు. నేడు లేఖలు ఇచ్చిన సుమారు 25 మందిలో ఏ ఒక్క గౌరవ మఠాధిపతి,పీఠాధిపతులు టిటిడిని అపకీర్తి పాలు చేసే విధంగా కొన్ని ఆరోపణలు వచ్చినపుడు స్పందించకపోవడం గమనార్హం!
“ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర హిందూ దేవాలయాలు ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. మఠాధిపతులు పీఠాధిపతులకు స్వాధీనం చేయండి,” అని భవిష్యత్తులో ఇదే మఠాధిపతులు, పీఠాధిపతులు లేఖలు రాస్తే రాష్ట్ర ప్రభుత్వం,టీటీడీ ధర్మకర్తల మండలి, ఐఏఎస్ అధికారులు ఆమోదిస్తారా?