రాజకీయ పార్టీ పేరు ప్రకటించడంలో తమిళ సూపర్ రజినీ కాంత్ ఊగిసలాట కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా ఆయన పార్టీ ప్రకటించలేదు. దాదాపు నాలుగేళ్లుగా ఆయన అభిమానుల ను పార్టీ పేరు చెప్పి వూరిస్తూనే ఉన్నారు.
ఈ రోజు ఆయన తన అసోసియేషన్ ‘రజని మక్కల్ మండ్రమ్ ’ (Rajini Makkal Mandram) జిల్లా కార్యదర్శులందరిని చెన్నైకి పిలిపించి సమావేశం ఏర్పాటుచేశారు. అయిదారు నెలల తర్వాత తొలిసారి ఆయన ఇపుడు బయటకు వచ్చారు.
ఈ మధ్యలో ఆయనకు కొద్ది సుస్తీ కూడా చేసింది.ఇపుడు ఆరోగ్యం కుదుట పడగానే హుటాహుటిని అందరిని రమ్మని పిలుపునీయడంతో సోమవారం నాడు ఆయన ఏదో కీలకమయిన ప్రకటన చేయబోతున్నారని అనుకున్నారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు.
సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తొందర్లోనే తన నిర్ణయం ప్రకటిస్తామని మాత్రం చెప్పారు.
‘ ఈ రోజు జిల్లాకార్యదర్శులంతా సమావేశానికి వచ్చారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి వాళ్ల వాళ్ల అభిప్రాయలు వ్యక్తం చేశారు.నేనూ నాఅభిప్రాయాలు చెప్పాను. నేను ప్రకటించే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.రాజకీయప్రవేశం మీద తొందర్లోనే నిర్ణయం ప్రకటిస్తాను,’ అని పోయెస్ గార్డెన్ నివాసంలో విలేకరులకు చెప్పారు.
ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఆయన ఎపుడో 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించారు. తొందర్లో ప్రకటన అన్నారు. ఆ ప్రకటన ఇంతవరకు వెలవడ లేదు. మొదట్లో పరిస్థితి అనుకూలంగా లేదన్నారు. ఆరోగ్య కారణాలున్నారు. 2016లో ఆయనకు రీనల్ ట్రాన్స్ ప్లాంట్ జరిగింది. తర్వాత కోవిడ్ వచ్చింది. ఈరెండు కారణాల వల్ల ఇప్పట్లో రాజకీయకలాపాలుప్రారంభించడం కష్టమన్నారు. ఈ మధ్యలో ఆయన ఏకంగా బిజెపిలోనే చేరతారని పుకారు కూడా వచ్చింది.
అయితే, సమావేశానికి వచ్చిన అభిమానులు మాత్రం రెండు మూడు రోజుల్లోనే తన నాయకుడిని నుంచి ప్రకటన వెలువడుతుందని ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పెట్టే సమయం ఆసన్నమయిందని, ఇక ఆయన వెనక్కు పోలేరని, కచ్చితంగా తొందర్లోనే తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటిస్తారని చెన్నైలో చాలా మంది భావిస్తున్నారు.