కోవిడ్ నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు క్రమంగా కోలుకుంటున్నది.విమాన ప్రయాణాలు సురక్షితమన్న నమ్మకం పెరుగుతుండటంలో ప్రజలు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. దీనితో కోవిడ్ లాక్ డౌన్ సడలిచాక విమానాశ్రయాలుకార్యకలాపాలు ప్రారంభించాయి.
అప్పటినుంచి విమాన ప్రయాణీకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. హైదరాబాద్ జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దేశీయ ప్రయాణికుల సంఖ్య నవంబర్ నెలలో 37,000 కు చేరింది.
మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు ఇంకా ప్రయాణికుల ఆరోగ్య ప్రొపైల్, RT-PCR మెడికల్ రిపోర్టులను అడుగుతున్నసంగతి తెలిసిందే.దీనితో ఈ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ టెస్టింగ్ కేంద్రం పనిచేస్తున్నది. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడుతూ ఉంది.
మే 25 నుండి దేశీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినా మొదటి కొన్ని వారాలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 3000 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించారు.ఇదిసెప్టెంబర్ లో 20 వేలకు పెరిగింది.కోవిడ్ రాక ముందు రోజు ఈ ఎయిర్ పోర్ట్ నుంచి 60వేల మంది ప్రయాణికులుప్రయాణించే వారు.