కడప జిల్లా పోరుమామిళ్ల పి.ఎస్ పరిధిలో రేపల్లె వాగు ఉధృతికి కాజ్ వేపై నీటి ప్రవాహంలో చిక్కుకున్న 5 మంది మహిళలను లోకల్ పోలీసుల కాపాడారు. ఇక్కడికి సమీపంలోని కొట్టాల పల్లి గ్రామం నుండి పనిపై గానుగపెంటకు వెళ్లి తిరిగివస్తుండగా వారు వరదలో చిక్కుకున్నారు.
మొదట్లో ప్రవాహం తక్కువ ఉండటంతో సులువుగా వారు గ్రామం నుండి వెళ్తలిపోయారు. తిరుగు ప్రయాణంలో కూాడా పెద్దగాా వరద లేదు. అయితే, వాగులో కొద్దీ దూరం దూరం వచ్చేసరి ప్రవాహ ఉదృతి పెరిగింది.దీనితో భయపడిన మహిళలు రక్షించాలంటూ కేకలు వేశారు.
నివార్ తుఫాన్ వర్షాల వల్ల పోరుమామిళ్ల నుండి చెరువులు, వాగులు, నదుల ప్రమాదకర స్థితిని పరిశీలిస్తున్న అటు వైపు తిరుగుతున్న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, కానిస్టేబుల్ ఓబులేసు ఈ మహిళల కేకలు విన్నారు.
వెంటనే వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు.హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు సమయస్ఫూర్తితో కాజ్ వే వంతెన మధ్యకు వెళ్లి మహిళలను ఒడ్డుకు చేర్చారు.