హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల క్యాంపెయిన్ చాలా ఆవేశపూరితంగా సాగుతూఉంది. ఇపుడుదేశంలో ఎక్కడా ఎన్నికలు లేకపోవడం, దానికితోడు, ఎక్కడా దేశం దృష్టి ఆకర్షించే సంఘటలను లేకపోవడంతో స్థానిక ఎన్నికలే అయినా జిహెచ్ ఎం సి ఎన్నిక జాతీయ వార్త అయిపోయింది.పలువురు ఢిల్లీ విశ్లేషకులు రంగ ప్రేవేశం చేశారు. జాతీయ ప్రాధాన్యం ఇస్తూ విశ్లేషిస్తున్నారు.
కొందరైతే బిజెపికిది సౌత్ గేట్ వే అంటున్నారు.
గ్రేటర్ హైదరాాాబాద్ ను వశపర్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బిజెపికి దారి ఏర్పడుతుందని,ఆపై ఇక్కడి నుంచి తమిళనాడు మీద గురిపెట్టవచ్చని చెప్పేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిహెచ్ ఎంపిలు ఏ పార్టీ గెలిచినా దానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది.
ఈ ఎన్నికల్లో బల్దియా మేయరు కావాలంటే ఏ పార్టీకి ఎన్నివోట్లురావాలో ఒక సారి చూద్దాం:
ఎన్నికల్లో గెలిచి వచ్చే కార్పొరేటర్లు 150 + 52 ఎక్స్ అఫిషియో ఓట్లు = 202
ఎక్స్ అఫీసియో సభ్యులు అంటే, ఎమ్మెల్యేలు,ఎంపిలు, ఎమ్మెల్సీలు ..
టిఆర్ఎస్ గెలవాలి అంటే… ఎక్స్ అఫిషియో ఓట్లు (ఎంపీ ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు కలిపి) 38 ఓట్లు ఉన్నాయి. దీనికి ఇంకా 64 డివిజన్లు గెలిస్తే మేయర్ పీఠము వరిస్తుంది
MIM గెలవాలంటే… ఎక్స్ అఫిషియో ఓట్లు 10 ఉన్నాయి ఇంకా 92 గెలిస్తే మేయర్ పీఠం వరిస్తుంది.
బిజెపి గెలవాలంటే… ఎక్స్ అఫిషియో ఓట్లు 3 ఉన్నాయి ఇంకా 99 గెలిస్తే మేయర్ పీఠం దక్కుతుంది.
కాంగ్రెస్ గెలవాలంటే… ఎక్స్ అఫిషియో ఓట్లు రేవంత్ రెడ్డి ఎంపీ 1 ఉన్నది, ఇంకా 101 గెలిస్తే మేయర్ పీఠం దక్కు తుంది.