హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బిజెపిని పొలిమేరల వరకు తరమాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో బిజెపి, ఎంఐఎం, టిఆర్ ఎస్ క్యాంపెయిన్ కాంగ్రెస్ వాణి కూడా వినిపించేందుకు రేవంత్ చాలా ప్రయత్నిస్తున్నారు.27వ తేదీన జగద్దిరి గుట్ట కాంగ్రెస్ అభ్యర్థి వరమ్మ తరుఫున ఆయన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం చైశారు.
రేవంత్ రోడ్ షోలు కూడా బాగా జనాన్నిఆకట్టుకుంటున్నాయి. ఆయన బిజెపి, టిఆర్ఎస్, ఎంఐఎం కలసి మత విద్వేషాలు బహిరంగంగా రెచ్చగొడుతున్నాయని, వీటి వల్ల మూడు పార్టీలు వోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేం లేదు భూకబ్జాలు పెటడంతప్ప అని ఆయన అన్నారు.
రేవంత్ ఏమన్నారంటే…
“జగద్గిరిగుట్టలో ఏం చూసి టిఆర్ఎస్ కు ఓటేయాలని నేను అడుగుతున్న.కరోనా, వరదలు వచ్చినప్పుడు ఈ టిఆర్ఎస్, బిజెపి వాళ్లు ఎటు పోయారు. ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతరా? నేడు ఎంఐఎం, బిజెపి వాళ్లు నాటకాలు ఆడుతున్నరు. హిందూ ముస్లింల మధ్య విభజన తెస్తరట. హిందూ ముస్లింలు కత్తులతో పొడుచుకుంటే.. మన రక్తం మూసీలో ఏరులై పారితే వీళ్లు ఓట్లు తీసుకుని గద్దెనెక్కుతరట.
ఓట్ల కోసం నీచాతి నీచానికి దిగజారుతున్నరు బిజెపి వాళ్లు. పివి ఘాట్ కూలుస్తామని ఎవరైనా గడ్డపారలు తీసుకుని వస్తే అవే గడ్డపారలు గుంజుకుని వచ్చినోడి గుండెల్లో దింపుతం. బిజెపి వాడెందుకు మా గురించి మాట్లాడేది.”
కెసిఆర్ ఏంచేస్తున్నాడో తెలుసా?
“ప్రతిపక్షంలో ఎవరూ లేకపోతే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుంది. రాచరికం వస్తది. పాలకుడు ఫాం హౌస్ లో పడుకునుడు తప్ప ఏం చేయడు. కేసిఆర్ ఎత్తిపోతల పథకం అంటే ఏందో అనుకున్న. పొద్దున లేస్తే కేసిఆర్ ఫాం హౌస్ లో ఎత్తుడు పోసుడు తప్ప ఏం చేస్తున్నడు. ఎత్తుడు పోసుడు చేయలేక చేయి నొస్తుందని మంత్రి జగదీష్ రెడ్డిని పెట్టుకున్నడు. రోజు జగదీష్ రెడ్డి గిలాస ఎత్తి నోట్లె పోస్తడు. పోసినంక గిలాస కింద పెడతడు. ఇలా నడుస్తుంది రాజ్యం. ఆలోచన చేసి కాంగ్రెస్ కు ఓటేయండి. ఆశీర్వదించడానికి వర్షం కూడా వచ్చింది.”