వాల్ట్ డిస్నీ కంపెనీ 32వేల మందిని ఉద్యోగాలనుంచి తొలిగిస్తూ ఉంది. ఇందులో ఎక్కువ ఉద్యోగాలు ధీమ్ పార్క్ లలోనివే. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రిసార్టులు, పార్క్ లు వెలవెలబోతూ ఉండటంతో, ఇప్పట్లోఅవి గతవైభవం పొందుతాయన్న గ్యారంటీ లేకపోవడంతో ఇలా భారీగా ఉద్యోగాలకు ఈ కంపెనీ కోత విధిస్తున్నది.
యుస్ సక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ కు వాల్ట్ డిస్నీ కంపెనీ సమర్పించిన వివరాల ప్రకారం కంపెనీ 32 వేల ఉద్యోగులను తొలిగించాలనుకుంటుంది. గతంలో కంపెనీ ప్రకటించిన దానికంటే ఇది నాలుగువేలు ఎక్కువ అని rt.com రాసింది.. డిస్నీ ఆర్థిక సంత్సరం అక్టోబర్ మొదలయింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్వార్ధంలోనే ఈ ఉద్యోగాలూడిపోనున్నాయి.
సదరన్ క్యాలిఫోర్నియాలో డిస్నీల్యాండ్ మూతపడి ఉంది. ఇదెపుడు ప్రారంభమవుతుందో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఈ పార్క్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో కంపెనీ ఉద్యోగులు అవసరం లేదని భావిస్తూ ఉంది. డిస్నీల్యాండ్ కు షాంగై, హాంకాంగ్, టోక్యోలలో ప్రారంభమయనా అమెరికాలోని 12 పార్కులు ఇంకా తెరుచుకోలేదు. ఇవన్నీ లాక్ డౌన్ కారణంగా మూతపడ్డాయి. అయితే డిస్నీ ల్యాండ్ ఫ్లారిడా, ప్యారిస్ లలో ఈ మధ్య పార్కులు తెరుచుకున్నాయి. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ మొదలుకావడంతో ఇవి మళ్లీ మూతపడ్డాయి.