తిరుపతి సమీపంలోని నారాయణవనం నుండి దాదాపుగా 7 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో ఉన్న సుందర ప్రదేశం సింగిరి కోన
నారాయణవనం నుండి పల్లెల మీదుగా జనావాసాలకు చాలా దూరంగా వెళ్ళాలి. అక్కడొక చిన్న జలపాతం, కోనేరు, ఈ మధ్యనే పునః నిర్మించిన లక్ష్మీనారసింహుని ఆలయం ఉంటాయి. పచ్చని ప్రకృతి, ప్రశాంత వాతావరణం చాలా ఆహ్లాదకరమయిన ప్రదేశం సింగిరి కోన. పట్టణ రణగొణ ధ్వనుకుల దూరంగా ఉంటే జీవితంలో ఎంత నిశ్బద్దంగా నిశ్చలంగా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రదేశమేకాదు, ఈ ప్రదేశానికి ట్రెక్ కూడా చాాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడికి రావాలనుకునే వారు తిండిగురించి ఆలోచించాల్సిన పనిలేదు.
మనం ఎంత రాత్రిలో వెళ్లినా ఇక్కడ భోజనం పెడతారు.
వెళ్ళేటప్పుడు మీరూ బియ్యం, కూరగాయలు తీసుకొని వెళ్లి వాళ్లకి ఇవ్వొచ్చు…మనం మరొకరికి భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం.అలా భోజనం నిత్యాన్నదానం అవుతుంది.
నారాయనవణం నుండి కొంతదూరం నా టూవీలర్లో వెళ్ళాను. కాని, అడవిలో నడవాలిపించింది ఒంటరిగా. ఎవ్వరు లేరు ముందు వెనుక కనుచూపుమేరలో. చుట్టూ అడవి అయినా, చాలా థ్రిల్ ఫీలయ్యాను. ప్రకృతిని ఆస్వాదిస్తూ అడవిలో లాంగ్ వాక్ (దాదాపుగా పోను రాను 10 కి.మీ) చేయాలనుకున్న వారికి ఇంతకన్నా మంచి ప్లేస్ అరుదు. .సూర్యోదయ సమయానికి ప్లాన్ చేసుకుంటే మంచింది.
అప్పుడపుడు ఎవరొకరు ఎదురుగావస్తూనే ఉంటారు.
అక్కడికి వెళ్లాక, కొత్త స్నేహితులు..బాలాజీ, సాయిలు పరిచయమమయ్యారు. బాగా కలిసిపోయారు. వాళ్లు ఈ ప్రాంతన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఇలాంటి ప్రాంతాలను వాటి సహజ సౌందర్యాన్ని కోల్పోనీయకుండా ఉంచాల్సిన బాధ్యత మనందరిది…