అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు రాయవద్దని ఆంధప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్టర్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి,ఎం ఆర్ షాల డివిజన్ బెంచ్ ఈ మేరకుస్టే ఆర్టర్ జారీ చేసింది.
ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నియమించింది. ఈ దర్యాప్తు అధారంగా కట్టిన ఎఫ్ ఐ ఆర్ లోని అంశాలను రిపోర్టు చేయరాదని హైకోర్టు స్టే సెప్టెంబర్ 15న స్టే ఇచ్చింది.
దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. భూకుంభకోణం వార్తలను రాయవద్దనడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. పిటిషనర్ కోరకుండానే హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేయడానికి అభ్యంతరం తెలిసింది.
సిట్ దర్యాప్తు మీద హైకోర్టు విధించిన స్టే విషయంలో జోక్యంచేసుకోనకపోయినా, వార్తలను రిపోర్టు చేయడాన్ని తప్పు పట్టింది.దీని ఉన్న స్టేని ఎత్తి వేసింది.