ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా విజ్ఞప్తి

పలు రాష్ట్రాలలో కరోనా మూడోవిడత దాడి చేస్తూ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె  చంద్రశేఖర్ రావు  రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 కేంద్రం డిసెంబర్ నెల కోసం కొత్త నియమాలనువిడుదల చేసిన సందర్బంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్నది. అందువల్ల
1. విధిగా మాస్కును ధరించండి
2. భౌతిక దూరం పాటించండి
3. గుంపులుగా కలవకండి
4. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి
5. కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానం వస్తే మీ దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టెస్ట్ ఉచితంగా చేయించుకోండి
6. ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లైతే ఉచితంగా కోవిడ్ ట్రీట్మెంట్ కిట్ ను పొందండి. డాక్టర్ సలహాలు, సూచనలు పాటిస్తూ మందులు వాడండి.
7. తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ప్రజల ఆరోగ్య పరిరక్షణే.
ఇది ఇలా ఉంటే డిసెంబర్ నెల కోసం కేంద్రం కొత్త కరోనా నియమాలు విడుదల చేసింది. వివరాలు:

 

కేంద్రం కరోనా  కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది.  కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ఈ  కొత్త నియమాలకు ప్రకారం  రాష్ట్రాలు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినపుడు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే, లాక్ డౌన్ విధించడానికి వీల్లేదు. దీనికి కేంద్రం పర్మిషన్ అవసరం.  కాకపోతే, ఆఫీస్ టైమింగ్స్ పెంచుకుని ఉద్యోగులు అంతా ఒకే సారి కాకుండా షిఫ్టుల వారీగా పని చేసే ఏర్పాటు చేసుకోవచ్చు.   కంటైన్ మెంట్ జోన్లకు బయట ఎలాంటి పరిస్థితులలో కూడా లాక్ డౌన్ విధించడానికి వీల్లేదు.
Guidelines for Survieillance, Containment and Cautioon పేరుతో ఈ కొత్త కోవిడ్ ప్రొటోకోల్ ను కేంద్రం విడుదల చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి  డిసెంబర్ 31 దాకా అమలులో ఉంటుంది.
నిన్న ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో మాట్లాడిన తర్వాత ఈ కొత్త నియమాలు విడుదల చేశారు. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి మూడో రౌండు కొన్ని రాష్ట్రాలల్లో తీవ్రంగా ఉన్న విషయం  చర్చకు వచ్చింది.
కొత్త ఉత్తర్వులలో కరోనా నివారణ పద్ధతులు కఠినంగా పాటించాలని,   కార్యాలయాలలో, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించనవారి మీద జరిమానా విధించాలని కూడా  కేంద్రం పేర్కొంది.
మార్కెట్ లలో సంతలలో, బస్సులు, రైళ్లవంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థలలో సమాజిక దూరం పాటించే విధానంగా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగానియమాలు విడుదల చేయనుంది.
అంతర్రాష్ట్ర ప్రయాణాలమీద, రవాణా మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వీటికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *