(కె.కన్నబాబు , కమిషనర్, విపత్తుల శాఖ, ఆంధ్రప్రదేశ్ )
తదుపరి 12 గంటలలో ‘నివార్’ అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తదుపరి 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా తరువాత వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.
ఇది తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ – మమల్లాపురం (తమిళనాడు) మధ్య పుదుచ్చేరికి సమీపంలో నవంబర్ 25 వ తేదీ సాయంత్రం అతి తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది.
తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 కి.మీ నుండి 130 కి.మీ గరిష్టంగా 145 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో నివార్ తుఫాన్ కేంద్రీకృతం అయింది.
ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.
తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు
నివర్ ప్రభావంతో రేపు ,ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.
ముందస్తుగా సహాయక చర్యలకోసం నెల్లూరు జిల్లాకు 2-ఎస్డీఆర్ఎఫ్ , 1-ఎన్డీఆర్ఎఫ్ బృందాలను చిత్తూరు , ప్రకాశం జిల్లాలకు తరలించారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
1) Cyclone “NIVAR” to cross Tamilnadu-Puducherry coasts between Karaikal and Mamallapuram as a very severe cyclonic storm during late evening of 25th November.
2)Depression over Gulf of Aden and adjoining Somalia weakened into a well marked low pressure area. pic.twitter.com/ZWzqjnbDUB— India Meteorological Department (@Indiametdept) November 24, 2020