ఇపుడు బంగాళాఖాతంలో చెలరేగుతున్న తుఫాన్ పేరు నివార్ (Nivar). ఈ తుఫాన్ కు ఆపేరు పెట్టింది ఇరాన్. ప్రపంచ వాతావరణ సంస్థ( world Meteorogical Organization) నియమాల ప్రకారం కొనని దేశాలు తుఫాన్ లకుపేర్లు పెట్టే అవకాశం లభిస్తుంది. ఇలా ఈ సారి తుఫాన్ ఇరాన్ ‘నివార్’ పేరు పెట్టింది. నివార్ అంటే నివారించడం (prevention)
నివార్ తుఫాన్ బుధవారం సాయంకాలానికిి పుదుచ్చేరి సమీపంలో తీరం తాకుతుందని చెబుతున్నారు.
నివార్ తుఫాన్ నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ (North Idian Ocean Region)లోని బంగాళ ఖాతంలో లేచింది. ఈ రీజియన్ లో 13 దేశాలున్నాయి. ఇందులో బంగ్లా దేశ్, ఇండియా, మాల్దీవులు,యమన్మార్, ఒమాన్, పాకిస్తాన్, శ్రీలంక, ధాయిలాండ్ కూడా ఉన్నాయి. ఇలా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలల వచ్చే తుఫాన్ పేరు పెట్టాలని 2000 సంవత్సరంలో ఈ దేశాల మధ్య ఒప్పందం జరిగింది.
2018లో జాబితాకు ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ, ఎమెన్ కూడా వచ్చి చేరాయి.
ఈ దేశాలన్నీ ఇంతవరకు ఈ ప్రాంతంలో వచ్చిన 169 తుఫాన్ లకు పేర్లు పెట్టాయి. 2020 ఏప్రిల్ లో తయారయిన కొత్త జాబితా ఇది. ప్రతిదేశం 13 పేర్లు సూచించింది. ఈ జాబితా నుంచి ఇంతవరకు రెండు పేర్లు ఎంపిక చేశారు. నివార్ మూడోది. ప్రతిసభ్య దేశం సూచించిన పేర్లను ఎబిసిడిల క్రమంలో జాబితాలో చేరుస్తారు.ఆయాదేశాల వంతులను బట్టి ఈ పేర్ల నుంచి ఒక దానిని ఎంపిక చేస్తారు.
తుఫాన్ లను సులభంగా గుర్తించేందుకు ఈ నామకరణ పద్ధతి ప్రవేశపెట్టారు. మరొక ముఖ్యమయిన ఉద్దేశమేంటంటే, ఆయన దేశాల సంస్కాృతిక నేపథ్యంలో నుంచి ఈ పేర్లు వస్తాయి కాబటి, ఈ పేర్ల ద్వారా సులభంగా ప్రజల దృష్టి ఆకర్షించవచ్చు. అపుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు కాబట్టి,తుఫాను సమాచారాన్ని వారికి వేగంగా చేరవేయవచ్చు.
గత తుఫాన్ లలో నిసర్గ తుఫాన్ పేరును బంగ్లాదేశ్ సూచించింది. గతి అనేపేరును భారతదేశం సూచించింది. ఈ తుఫాన్ సోమాలియా దగ్గిర తీరం తాకింది. గతి అంటే త్వరం (velocity) అర్థం. నివార్ పేరు ఇరాన్ సూచించిన పేర్ల జాబితా నుంచి ఎంపిక చేశారు.
మే నెలలో బెంగాల్, ఒదిషా రాష్ట్రాలలో తఫాన్ Amphan బీభత్సం సృష్టించింది. ఈ పేరు ఏమ్ (Am) పున్ (Pun) సూచించింది. ధాయ్ లాండ్. దీని అర్థం ఆకాశం అని.
తుఫాన్ లకు మహిళల పేర్లు పెట్టడం అధికారికంగా 1953 నుంచి అమలులోకి వచ్చింది. తుఫాన్ పేర్లు పరిశీలించండి, అలియా, నర్గీస్, నీలోఫర్, మాయ… అన్నీ మహిళల పేర్లే.
పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో వచ్చే తుఫాన్ పేర్లు ఆరేళ్లకొకసారి పునరావృతమవుతూ ఉంటాయి.
నిజానికి తుఫాన్ లకు పేర్లు పెట్టడం ఇప్పటి అలవాటు కాదు.శతాబ్దాల కిందట కూడా తుఫాన్ లకు పేర్లుపెట్టారు. కాకపోతే, అపుడొక పద్ధతంటూ లేదు ఉదాహరణకు 1834లో వచ్చిన ఒక తుఫాన్ పేరు పాద్రి రూయ జ్ (Padre-Ruiz). ఇది డొమినకల్ రిపబ్లిక్ చెందిన ఒక సెయింట్ పేరు. ఇదే విధంగా 1876లో వచ్చిన మరొక తుఫాన్ పేరు కేథోలిక్ ప్రీస్టు పేరు శాన్ ఫిలిప్ పెట్టారు.