ఆక్స్ ఫోర్డ్ యూనివర్శిటీకి శాస్త్రవేత్తులురూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అంత ప్రతిభా శీలంగా లేదనుకోవాలి.
ఈ వ్యాక్సిన్ ఇపుడు రెండో దశ, మూడో దశ పరీక్షల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇది కేవలం 70 శాతం ఎఫిసియెన్సీనే చూపిస్తున్నదని యూనివర్శిటీ వెల్లడించింది.
ఈవ్యాక్సిన్ పేరు AZD 1222. ఇది ఇంగ్లండ్, బ్రెజిల్ దేశాలలో క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. 70 శాతమే పనిచేస్తుందంటే, ఈ వ్యాక్సిన్ నూరు మంది ఎక్కిస్తే, 70 మంది లోపనిచేస్తుంది.
మరొక 30 శాతమ్ మందిలో దీని ప్రభావం ఉండదు. ఈ వ్యాక్సిన్ రెండు రకాల పద్ధతుల్లో ప్రయోగించి పరీక్షించారు. ఇందులో ఒక రెజిమన్ 90 దాకా ప్రతిభావవంతంగా పనిచేసింది.
రెండు డోసుల సగటు ఎఫిషియన్సీ 70 శాతం దాకా ఉంటుందని ఎస్ట్రాజెనెకా సోమవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది.