అనంతపురం రాజకీయాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక కొత్త సంచలనం. ఆయన రాజకీయ ప్రవేశం, అంతకు ముందు పోలీసు ఇన్సెపెక్టర్ గా ఉన్నపుడు జిల్లా బలాఢ్యుడయిన జెసి దివాకర్ రెడ్డి కి విసిరిన సవాల్ , ఎన్నికల్లో గెలుపు అన్ని సంచలనమే.
అందుకే ఆయనను జిల్లాలో ‘పులి’ లా చూస్తారు. పులి అని పిలుస్తారు. అలా ఎక్కడా చూసిన పులి అనడం హిందూపురం నియోజకవర్గంలో నే కాదు, అనంతపురం నియోజకవర్గంలో కూడా వినబడుతూ ఉంటుంది.
జిల్లా రాజకీయాలలో సంప్రదాయిక మోతుబరి నాయకుడిగా కాకుండా అసలైన జననేతగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇంతవరకు జిల్లా మీద పెద్ద పెద్ద వ్యాపారస్థులు, భూస్వాములు పెత్తనం చలాయించారు. మాధవ్ వంటి వాళ్ల రాకతో ఆ రాజకీయాలు మాయమవుతున్నాయను కోెవాలి. ఇదొక వాంఛనీయ పరిణామం.
ఎంపిగా గెలిచినా మాధవ్ ఇప్పటిదాకా ఈ ఎంపి కల్చర్ ను దూరంగా ఉంచారు. తన దగ్గరికి రానీయలేదు.
ప్రజలకు తనకు గన్ మన్ అడ్డమని భావించారాయన. అనంతపురం రామ్ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి ఎవరైనా రావచ్చు పోవచ్చు. ఎపుడూ అందుబాటులో ఉంటాడని పేరు. జిల్లాకు ఇలాంటి నాయకుడు లేక చాలా కాలమయింది.
జిల్లాలో ఆయన ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతాాడా లేక హిందూపురం ఎంపిగా మిగిలిపోతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది.
ఇప్పటికయితే, ఆయన్ని ప్రజలు పులిలాా చేస్తున్నారు. ఆయన పులిలా తిరగాలనుకుంటున్నారు. పులిలా పనిచేయాలనుకుంటున్నారు, ఆయన కనబడితే చాలు ‘అదిగో పులి’ అంటున్నారు.
ఇది కళ్యాణ్ దుర్గంలో జరిగిన ఒక సభలో జరిగింది ఒక సాక్ష్యం.
‘అదిగో పులి … పులి… వచ్చేసింది రోయ్, పులి!’ అనేది ఈ రోజు ఎంపీ మాధవ్ సభలో అడుగు పెట్టగానే ప్రజలు పెద్ద ఎత్తున చేసిన నినాదం.
ఈ నినాదంతో, చప్పట్లతో, హర్షధ్వానాలతో సభ ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోయింది.