ఒక చెంప దెబ్బ ‘షో మాన్ ఆఫ్ ది మిలేనియం’ ను సృష్టించిందా?

(అహ్మద్ షరీఫ్)
అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచి కనీ, అనుకోవడమే మనిషి పని”.
అందరు మనుషుల విషయం ఏమో కానీ, రాజ్ కపూర్ మాత్రం  విషయాన్ని  నూటికి నూరు పాళ్లూ నమ్మాడు, పాటించాడు.
అప్పట్లో గొప్ప నటుడిగా విరాజిల్లుతున్న తండ్రి పృథ్విరాజ్ కపూర్  సహాయం తో సినిమా రంగం లో కి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు రాజ్ కపూర్.
ఆయన తో తన కోరిక చెబితే తన మిత్రుడు నిర్మాత, దర్శకుడు, రచయితా అయిన   కేదార్ శర్మ (కేదార్ నాథ్ శర్మ) దగ్గరికి తీసుకేళ్లాడు పృథ్విరాజ్ కపూర్.
 కొడుకు   రాజ్ కపూర్ ను కేదార్ శర్మ కు పరిచయం చేస్తూ ఏమాత్రం సందేహించకుండా “ఇతణ్ణి పనిలో పెట్టుకోఏం పని ఇవ్వాలో నువ్వే నిర్ణయించుకో. నా కొడుకని చూడకు” అన్నాడట.
ఫలితంగా రాజ్ కపూర్ కేదార్ శర్మ వద్ద క్లాపర్ బాయ్  (clapper boy) గా చేరాడు.  
రాజ్ కపూర్ క్లా పర్ బాయ్ జీవితం గురించి బాధ పడలేదు.  న్యూనత అనుభవించలేదు. అయితే అతడిలో అప్పట్లో పిల్ల చేష్ట వుండేది. క్లాప్ ఇవ్వమన్న పుడల్లా తల దువ్వుకోవడం, కెమేరా ముందుకు రావడం. ఇది కేదార్ శర్మకు నచ్చేది కాదు పలు మార్లు రాజ్ కపూర్ తో అలా చేయొద్దని చెప్పాడట కూడాను. అయినా అలవాటును రాజ్ కపూర్ మాన లేక పోయాడు.
ఒక రోజు కేదార్ శర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కీలక సన్నివేశం తీస్తున్నప్పుడు క్లాప్ కొట్టే ముందు ఇలాగే చేసి రాజ్ కపూర్ సన్నివేశాన్ని చెడ గొట్టాడు. హీరో గడ్డం క్లాప్ బోర్డులో ఇరుక్కుని వూడి వచ్చిందిట. డైలాగులూ చెప్పలేక హీరొ నిష్క్రమించాడు. ఇది చూసి కేదార్ శర్మ రాజ్ కపూర్ ని దగ్గరికి పిలిచి భరించ లేని కోపం తో అతడి చెంప ఛెళ్లు మనిపించాడట ( విషయాలు ఇంటర్వూ లో స్వయంగా కేదార్ శర్మా యే చెప్పాడు). ఇంకేముందీ. పాక్ అప్
రోజు రాత్రి కేదార్ శర్మ కి నిద్ర పట్టలేదుట. పిల్లవాడు (రాజ్ కపూర్) “ హక్కుందని నువ్వు నన్ను కొట్టావు ? నువ్వేమైయినా నాకు డబ్బులిస్తున్నావా?” అని తనని నిలదీస్తే తన దగ్గర సమాధానం లేదు అని మధన పడుతూ గడిపాడట రాత్రంతా. మరుసటి రోజు యధా విధి గా రాజ్ కపూర్ స్టుడియో కి వచ్చి ఏమీ జరగనట్లే కేదార్ శర్మ కు నమస్కరించి పని మొదలు పెట్టాడట. అప్పుడు కేదార్ శర్మ పిల్ల వాడికి కెమేరా వెనక కంటే కెమేరా ముందు వుండటం ఇష్టం లాగుందని ఊహించి రాజ్ కపూర్ని పిలిచి అయిదు వేల రూపాయలకు చెక్కు రాసి అతడికిస్తూ నా తదుపరి సినిమాలో నువ్వే హీరో వి అన్నాడట. సినిమా పేరు నీల్ కమల్ (పాతది). చిత్రం లో రాజ్ కపూర్ కు జంటగా మధుబాలా నటించింది. చిత్రం వీళ్లిద్దరికీ తొలి చిత్రమే.  
సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమయింది. కానీ బాలీవుడ్  చిత్ర సీమకు రెండు ఆణి ముత్యాల్ని ఇచ్చింది.  
చెంప దెబ్బ తిని రాజ్ కపూర్ వుక్రోషంగా వెళ్లి పోయివుంటే ఏం జరిగేదో తెలీదు కానీ, అతడు ఏమీ జరగనట్లు మరుసటి రోజు స్టూడియోకి రావటం వల్ల   బాలీ వుడ్ సినీ ప్రపంచం  ప్రేక్షకులు మరువలేని ఒక అందాల హీరోయిన్   మధుబాలా ను   షోమాన్ ఆఫ్ ది మిలేనియం రాజ్ కపూర్ ను  పొందింది.  వీరిద్దరి సినీ జీవితాలు చరిత్రలు స్టృష్టించడం అందరికీ తెలిసిందే.

 

Ahmed Sheriff

(అహ్మద్ షరీఫ్, ప్రాజెక్టు అండ్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కోచ్,  సినిమా విశ్లేషకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *