ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య రాజుకున్న పంచాయతీ ఎన్నికల వివాదం రాజ్ భవన్ కు చేరింది.
ఎన్నికల నిర్వహించలేమని, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నివారణ చర్యల్లో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలమ్ సాహ్ని లేఖ రాశాక ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమాశం అయ్యారు.
ఈ సమావేశం సుమారు 40 నిమిషాలపాటు కొనసాగింది.
స్థానిక సంస్థ ఎన్నికలు,ప్రభుత్వ వైఖరి మీద నీలం సాహ్ని రాసిన లేఖ గురించి ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని,స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేందుకు కమిషన్ సిద్ధంగా ఉందని ఆయనకు గవర్నర్ కు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును వివరించి,ఏపీ లో స్థానిక సంస్థ ఎన్నికలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి ఆయన వివరించినట్లు అధికారలు తెలిపారు.
స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్ లాంటి సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతూ ఉందని, గతంలో ఒక సారి ఈ సమస్యను అఫిడవిట్ రూపంలో కోర్టుల దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని కూడా ఆయన నిమ్మగడ్డ గవర్నర్ వివరించినట్లు తెలిసింది.