గోసంరక్షణ కోసం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ‘గో క్యాబినెట్’ ఏర్పాటు చేయాలను కుంటున్నది. గోవులకు సంబంధించిన భద్రత, పోషణ, ప్రోత్సాహం వంటి అన్ని వ్యవహారాలను ఈ క్యాబినెట్ చూసుకుంటుంది.
దేశంలో గోవుల కోసం ఇలా ఒక రాష్ట్రం క్యాబినెట్ ఏర్పాటుచేయడం ఇదే ప్రథమం.
ఈ క్యాబినెట్ తొలి సమావేశం నవంబర్ 22, మధ్యాహ్నం 12 లకు జరగుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్లెలడించారు.
ఈ క్యాబినెట్ లో పశుసంవర్థక శాక, అటవీ శాఖ, పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి, రెవిన్యూ, హోమ్, రైతు సంక్షేమ శాఖలుంటాయి.
గోవులను కాపాడటం, గో సంరక్షణ, గోదానం ప్రోత్సహించడం, గో సంతతిని పెంపొందించడం వంటి వ్యవహారాలు ఈ క్యాబినెట్ పరిధిలో ఉంటాయి.
నవంబర్ 22న గోకులాష్టమి సందర్భంగా అగర్ మాల్వా లో మధ్యాహ్నం12 గంటలకు మొదటి గో క్యాబినెట్ సమావేశం జరుగుతుంది.