దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో విడత విజృంభిస్తూ ఉండటంతో మార్కెట్ ప్రాంతాలలో లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు.
ఈ మేరకు ఆయన కేంద్రం అనుమతి కోరుతూ అభ్యర్థన లేఖ రాశారు.
ఢిల్లీలోని మార్కెట్ లన్న కోవిడ్-19 హట్ స్పాట్ గా మారే ప్రమాదం ఉందని ఆందోెళన వ్యక్తం చేస్తూ ఆయన లాక్ డౌన్ విధించేందుకు అనుమతి కోరారు. వివాహాలలో 200 మంది దాకా అతిధులను అనుమతిస్తు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు.
వివాహాలకు కేవలం 50 మంది అతిధులను మాత్రమే అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కోరినట్లు ఆయన ఈ రోజు ఆన్ లైన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఢిల్లీలో ఒక్కసారి కరోనా కేసులు పెరిగాయి. రోజు వారి కేసులు బుధవారం నాడు 8 వేలకు చేరాయి. అక్టోబర్ 28తర్వాత ఇలా పెరగడం ఇదే మొదటిసారి. అరోజుల్లో రోజు వారికేసులు 5 మించలేదు.