ఈ రోజు ‘మాలవానిగుండం’ జలపాతం…మాలవానిగుండం ఎక్కడుంది? (వీడియో)

మాల‌వాడి గుండం  ఎక్కడుందంటే…

(కథనం: రాఘవశర్మ)

తిరుపతి సమీపంలోని క‌పిల తీర్థానికి స‌మాంత‌రంగా ఒక చిన్న‌ జ‌ల‌పాతం ఉంది. క‌పిల తీర్థానికి ప‌డ‌మ‌టి వైపు తిరుమ‌ల కొండ పై నుంచి జాలువారుతూ ఉంటుంది.వర్షకాలం దూకుతూ ఉంటుంది.
దాని పేరు మాల‌వాడి గుండం.స్వాతంత్రానికి పూర్వం అనుకుంటా, క‌పిల తీర్థంలోకి ద‌ళితుల‌ను అనుమ‌తించేవారు కాదు. ఆ జ‌ల‌పాతంలో స్నానం చేసి, తిరుమ‌ల కొండ‌కు దణ్ణం పెట్టుకుని ద‌ళితులు వెళ్ళిపోయేవారు!
అందుకునే, ఆ జ‌ల‌పాతం ప‌డే నీటి గుండానికి మాల‌వాడి గుండం అని పేరు వ‌చ్చింది. క‌పిల తీర్థం లోకి ద‌ళితుల ప్ర‌వేశానికి ఇప్పుడు అభ్యంత‌రం లేక‌పోయినా, మాల‌వాడి గుండం అన్న పేరు అలా నిలిచిపోయింది.
ఒక‌ప్పుడు తిరుమ‌ల కొండెక్క‌డానికి కూడా ద‌ళితుల‌ను అనుమ‌తించేవారు కాదు. అలిపిరి మెట్ల దారిలో వ‌చ్చే తొలి మండ‌పాన్ని పాదాల మండ‌పం అంటారు.

 

(సౌజన్యం:నల్లమల యాత్రికులు వాట్సాప్ గ్రూప్)

ఆ మండ‌పం దాట‌గానే మాల‌దాసు, అత‌ని ముగ్గురు భార్య‌లు దేవుడిముందు సాష్టాంగం చేస్తున్న‌ట్టు నేల‌పైన చెక్కిన విగ్ర‌హాలు క‌నిపిస్తాయి.
అక్క‌డి వ‌ర‌కే ద‌ళితుల‌ను అనుమ‌తించేవారు.
భ‌గ‌వంతుడికి మాల దాసు తోలు చెప్పులు స‌మ‌ర్పించేవాడ‌ని ప్ర‌తీతి.
మాల‌వాడి గుండం అన్న పేరైనా, మాల‌దాసు విగ్ర‌హాలైనా ద‌ళితుల‌కు కుల‌వ్య‌వ‌స్థ చేసిన మాన‌ని గాయాలకు ప్ర‌తీక‌లుగా, మాయ‌ని మ‌చ్చ‌లుగా ఇప్ప‌టికీ ఇలా మిగిలిపోయాయి.
ఇంకా వివరాలకు మాల‌వాడి గుండం మాన‌ని గాయం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-8) మీద క్లిక్ చేయండి
ఇది కూాడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/features/trekking-to-kongumadugu-in-seshachalam-forests-near-tirupati/?fbclid=IwAR3Jgmfzi3uNHemJ5hS7ZuoW_1B_SWlDjpxtbWuZlATNwVQViOC_jsFv9u0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *