టి.అర్.ఎస్ లోని అంతర్గత నాయకత్వ పోరాటముతోనే దుబ్బాక లో బి.జె.పి.అభ్యర్థి ఎం రఘునందన్ రావు గెలులిచారు.
దుబ్బాక లో టి.అర్.ఎస్ ప్రచార భాధ్యతను స్వీకరించిన మంత్రి హరీష్ రావు ని దెబ్బ తీయడానికీ జరిగిన షడ్ యంత్రములో భాగమే బి.జె.పి గెలుపు. ఒకరినే టార్గెట్ చేయడానికి ఇతర మంత్రులను దుబ్బాక ప్రచారానికి పంపలేదు.
పోటీ హోరాహోరీ అనిపించినా కుల సామాజిక కోణము బి.జె.పి అభ్యర్థి గెలుపును సుగమనము చేసింది.
కుల సామాజిక ప్రభావముతోనే టి.అర్.ఎస్ అధినాయకత్వము బిజెపి అభ్యర్థికి సానుభూతి పెరిగే విధముగా వ్యవహరించింది.
కాంగ్రెస్ ఉనికిని దెబ్బ తీసి, బిజెపి అభ్యర్థికి సానుభూతి కలిగే విధముగా తనీఖీల పేరు మీద టి.ఆర్.ఎస్ ప్రభుత్వము మొదటి నుండి వ్యూహాత్మకముగా వ్యవహరించింది.
కాంగ్రెస్ అసలుకు పోటీలోనే లేదని, బిజెపియే పోటిలో ఉందనే భావన ప్రజలలొ కల్పించి, ఆ పార్టీ వైపు మొగ్గు చూపే లక్ష్యముతో టి. ఆర్.ఎస్ పనిచేసింది.
బిజెపి రాష్ట్రములో అల్లకల్లోలము సృష్టించడానికి ప్రయత్ని స్తుందని, తగు చర్యలు తీసుకోవాలని కె.టి.అర్ స్వయముగా ఎన్నికల సంఘానికి అందరూ ఆశ్చర్యపడే విధముగా లేఖ రాయడము ఈ కుట్రలో భాగమే.
రాష్ట్ర వ్యాప్థముగా బి.జె.పి నాయకులను గృహ నిర్బంద ములో పెట్టి ఉద్దేశ్యపూర్వకముగా బి.జె.పి అభ్యర్థి పట్ల సానుకూల వాతావరణాన్ని కల్పించారు.
దీనికంతా టి.అర్.ఎస్ లో జరుగుతున్న అంతర్గత నాయకత్వ పోరాటమే కారణము. భాధ్యత వహించిన మంత్రిని దెబ్బ తీయాలనే కుట్రలొ భాగముగానే . భారమంతా ఆ మంత్రి పై వేసినట్టు వేసి వెన్ను పోటు పొడిచారు. పెద్ద నాయకుడి నుండి క్రింది నాయకుడి వరకు క్షేత్ర స్తాయి లో పని చేసే విధముగా దుబ్బాక లో మొదలైన కాంగ్రెస్ పని తీరు భవిష్యత్ లో పార్టీ కి సత్పలితాలు ఇస్తుంది.
(జి.నిరంజన్, అధికార ప్రతినిధి,తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)