చిన్న చిన్నదేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో, లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్నికలు అనుకూలంగా లేనపుడు తిరుగుబాట్లు వస్తాయి. ఓడిపోయిన నాయకుడో లేదా సైన్యాధక్షుడో తిరుగుబాటు చేసి రాజ్యాంగాన్ని, పార్లమెంటును మూసేసి నియంతృత్వ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.
ఇలాంటి సంఘటనలు ఇండియా పొరుగు దేశాల్లో కూడా జరిగాయి.పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో ఏదో ఒక తిరుగుబాటూ జరగడాన్ని భారతీయలంతా చూశారు.
మయన్మార్ (బర్మా)కు సుదీర్ఘమయిన సైనిక నియంతృత్వ చరిత్ర ఉంది. 1962 లో మొదటి సారి సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2011 దాకా సైనిక పాలన కొనసాగింది. అవుంగ్ సాన్ సూచీ దశాబ్దాలపాటు విదేశాలలో తలదాచుకుని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. దీనికి గుర్తింపుగా ఆమెకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. చివరకు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మధ్య ధాయిలాండ్ లో కూడా సైన్యం తిరుగుబాటు చేసింది. థాయి మిలటరీ నియంతృత్వాల మీద The Atlantic కథనం ఇక్కడ చదవండి
రాజ్యంగ బద్ధంగా జరిగిన ఎన్నికల ఫలితాలను తిరస్కరించడమనేది ఇలా మూడో ప్రపంచ దేశాలలో అంటే ప్రజాస్వామ్యం ఇంకా వేళ్లూనని పేదదేశాలలో జరుగుతూ ఉంటుంది. కాని ఇండియా,ఇంగ్లండ్, ఫ్రాన్స్, వంటి పెద్దదేశాలలో ఎన్నికల ఫలితాలను కాదని తిరుగుబాట్లు వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాల మీద అనుమానాలొస్తే కోర్టు కెళ్లాల్సిందే తప్ప ఓడిపోయిన ప్రభుత్వాధినేత ‘నేను గద్దె దిగను,నేనే ప్రధానిగా కొనసాగుతాను,’ అని మొండికేయడం జరగదు. అమెరికాలో ఇలాంటి పరిస్థితి వస్తుందని వూహించనేలేం. ఉన్నంతలో అది బాగా లిబరల్ దేశం.
అయితే, మొన్న ఎన్నికలల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ (Joe Biden) గెలిచినట్లు స్పష్టంగా ఉన్నా , దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల ఫలితాలు గుర్తించనంటున్నాడు. తాను బైడెన్ కుఅధికారం బదిలీ చేసేదే లేదంటున్నాడు. రీ కౌంటింగ్ జరిగి, చివరి ఫలితాలు కూడా బైడెన్ కు అనుకూలంగా వచ్చినా తాను మాత్రం అధికారం వదులుకోనని చెబుతున్నాడు. ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన తర్వాత వచ్చే ది తన రెండో ప్రభుత్వమేనని చెబుతున్నారు. భారత్ తో సహా ఫ్రాన్స్, కెనడా,ఫ్రాన్స్ తో పాటు అనేక దేశాలు బైడెన్ ఎన్నిక ను గుర్తించి ఆయన శుభాకాంక్షలు చెబుతున్నా ట్రంపు మాత్రం ఎన్నికల ఫలితాను గుర్తించనంటున్నాడు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి బైడెన్ గెలిచాడని అంటున్నారు. ఏ రాష్ట్రంలో కూాడా ఎన్నికల అధికారులు దీనిని అంగీకరించడం లేదు. అంతేకాదు,పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రాలేదని, ట్రంఫు ఎలాంటి అధారాలుచూపకుండా ఫిర్యాదు చేస్తున్నారని ఎన్నికల అధికారులుచెబుతున్నారు.
మరి అధ్యక్షుడు ట్రంప్ ఏమి చేయబోతున్నారు?
దేశాధ్యక్షుడు ట్రంప్ తిరుగుబాటు చేయబోతున్నారా? టైమ్స్ ఆఫ్ ఇండియా ఇదే రాసింది. ట్రంప్ తిరుగుబాటురంగం సిద్ధం చేసుకుంటున్నారని ఈ పత్రిక అమెరికా ప్రతినిధి చిదానంద్ రాజ్ ఘట్ట రాశారు. ట్రంప్ ఎదో కుట్ర చేస్తున్నాడని అమెరికా పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి. The Crisis at the Top of the Pentagon Just Beginning అంటూ అని వాష్టింగ్టన్ పోస్టు లో జోష్ రోజిన్ అనే విశ్లేషకుడు రాశారు. అమెరికా రక్షణ కేంద్రమయిన పెంటగాన్ నుంచి ఎలా సీనియర్ అధికారులను తొలగిస్తున్నారు ఆయన ఇందులో రాశారు. కొందరితో బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. మరికొందరిని తొలగించేస్తున్నారు.
“By installing themselves in top jobs, these officials are stalling the transition, settling scores, and advancing their own ambitions. Many officials in the agencies they are taking over are also now wondering whether the loyalists’ plan includes helping Trump resist leaving office.” అని రోజిన్ రాశారు.
Trump is Staging a Coup…అని Daily Poster రాసింది.
Republicans are following a clear plan to try to overturn the election results, just like they did in 2000. And once again, Democrats are not sounding a loud enough alarm అని రాజకీయ పండితుడు డేవిడ్ శిరోటా Daily Poster రాశారు.
ఎన్నికల ఫలితాలు బైడెన్ కు అనుకూలంగా ఉన్నాయని, రీకౌంటింగ్ లో ఫలితాలు ట్రంప్ కు అనుకూలంగా వచ్చినా, బైెడెన్ గెలుపు లో మార్పుండదని అమెరికా పత్రికలన్నీ మొత్తుకుంటున్నాయి. అందుకే ప్రపంచదేశాధినేతలు బైడెన్ ను అభినందించారు.
ఇలాంటపుడు ట్రంప్ ఉన్నట్లుండి పెంటగన్ సీనియర్ అధికారులందరిని తొలిగించి తనకు అనుకూలమయిన వారిని నియమించుకున్నారు. పెంటగన్ లో ప్రవేశించిన ట్రంంప్ లాయలిస్టులలో భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ కూడా ఉన్నాడు.
ట్రంప్ తిరుగుబాటు ప్రయత్నం (coup) చేస్తున్నాడని చెబుతన్నది ఎవరో కాదు, ట్రంప్ మేనకోడలు మేరీ ట్రంప్ (Mary Trump). ఆమె ట్వీట్ చేస్తూ ఈ మేరకు హెచ్చరిక చేసింది.
President-elect Joe Biden won legitimately and decisively. No matter how much Donald and his enablers lie and spin, nothing will change that. But they’re going to break as much as they can on the way out. Stay vigilant–this is an attempted coup.
— Mary L Trump (@MaryLTrump) November 9, 2020
రెండు రోజులు కిందట ట్రంప్ డిఫెన్స్ సెక్రెటరీ (రక్షణ మంత్రి) మార్క్ ఎస్పర్ తో మరొక ముగ్గురు సీనియర్ అధికారలను తొలగించారు. ఆతర్వాత రక్షణ శాఖలోకి తన విధేయాలును తెచ్చుకోవడం మొదలు పెట్టారు. అంథోని టాటా అనే మాజీ జనరల్ ను అండర్ సెక్రటెరీ నియమించారు. ఇతని నియామకాన్ని గతంలో సెనెట్ ఒక సారి తిరస్కరిచింది. బరాక్ ఒబామాను టెర్రరిస్టు అని పిలిచి వివాదంలో చిక్కుకున్న వ్యక్తి టాటా ఇలాంటి వాళ్లందరిని రక్షణశాఖలోకి తీసుకుంటూ ఉండటంతో ట్రంపు తిరుగుబాటు సిద్ధమవుతున్నాడనే వార్తలు భగ్గుమన్నాయని టైమ్స్ రాసింది.
ట్రంపు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనలు కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. బైడెన్ కు అధికారం అప్పగించే ప్రసక్తే ఉండదని సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (హోంమంత్రి)మైక్ పాంపియో ప్రకటించారు. “there will be a smooth transition to second Trump administration,” అని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఇక తనే గెలిచినట్లు ఘంటా పధంగా చెబుతున్నారు. “… Trump continued to dig and insist he has won the election- or will win after recounts- and any other verdict would be a result of rigging even though many polling officials throughout the country say there (is) no evidence of large scale fraud.”అని టైమ్స్ రాసింది.
రాష్ట్రాలలో ట్రంపు సొంత పార్టీ (రిపబ్లికన్ ) నేతలు, అందునాఎన్నికల్లో బాగా ప్రచారం చేసిన నేతలు కూడా ట్రంపు వాదనతో ఎకీభవించడం లేదు. ఎన్నికల ఫలితాలను తారుమారుచేసేంతు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పలేమని వారు చెబుతున్నారు.
ఇలాంటి సొంతపార్టీనేతలను ట్రంప్ తిరస్కరిస్తున్నారు. వాళ్లందరిని ఫేక్ న్యూస్ ఏజన్సీలు వాడుకుంటున్నాయని, తానే గెలుస్తున్నానని ప్రకటించారు. అదీ అమెరికా పరిస్థితి.
A guy named Al Schmidt, a Philadelphia Commissioner and so-called Republican (RINO), is being used big time by the Fake News Media to explain how honest things were with respect to the Election in Philadelphia. He refuses to look at a mountain of corruption & dishonesty. We win!
— Donald J. Trump (@realDonaldTrump) November 11, 2020
The crisis at the top of the Pentagon is just beginning – (DANGER. We are watching a slow moving Trump coup to defy the Biden election and refuse to leave office by diktat. Believe your eyes. This will be a test of our institutions.) https://t.co/fB7JNUz1fg
— Barry R McCaffrey (@mccaffreyr3) November 11, 2020
The Trump Coup rolls on. Fueled by Trump’s brittle ego, idiocy, malice and the political cowardice of most all elected Republicans, this sad spectacle seems like the perfect ending to the reality show Presidency. It feels more like “Moon over Parador” than any type of real 1/
— Steve Schmidt (@SteveSchmidtSES) November 11, 2020