విలేకరి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు


ఒక విలేకరి వదిలి వెళ్ళిన స్థానాన్ని మరో విలేకరికి అందించిన దుబ్బాక!

 

భారతీయ జనతా పార్టీ లో కీలక నేత… క్యాడర్​కు సదా అందుబాటులో ఉంటాడనే పేరున్ననేత… రెండు సార్లు ఓటమి పాలైనా పోరాటం ఆపలేదు. చివరకు మూడోసారి విజయం సాధించే దిశలో ఉన్నారు.  మాధవనేని రఘునందన్ రావుదుబ్బాక పీఠం కైవసం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలోలో టివిచానెళ్లలో వార్త భగ్గు మంది . 1079 ఓట్ల తో రఘునందన్ రావు విజయం సాధించినట్లు సమచారం.ఫలితం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ లోపు ఎన్నిలక కమిషన్ అధికారి ఇలా వివరణ ఇచ్చారు.
‘దుబ్బాకలో ఎవరు గెలిచారనేది మేం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కొన్ని చానళ్లలో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా వస్తోన్న వార్త సాధికారికం కాదు. మొత్తం 4 ఈవీఎంలు మొరాయించాయి. వాటిలో 2 ఈవీఎంలు బటన్ నొక్కినా తెరుచుకోవడం లేదు. మరో రెండింటిలో మాక్ పోల్ ఓట్లు డిలీట్ చేయలేదు.ఆ నాలుగు ఈవీఎంల వీవీపాట్లను లెక్కించిన తరవాత అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా అధికారిక ప్రకటన చేస్తాం. 23 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం వీవీపాట్లలో ఓట్లను లెక్కిస్తున్నాం.మరికాసేపట్లో దుబ్బాక ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తాం:-డిప్యూటీ సీఈఓ, సీఈఓ కార్యాలయం ’
అయితే, దుబ్బాక ఎన్నిక  ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగుతున్నది. ఓటింగ్​లో అధికార పార్టీపై  తొలి నుంచి ఆయన స్వల్ప ఆధిక్యతచూపిస్తూ వచ్చారు.  తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయభేరీ మోగించేలా ఉన్నారు.
నిజానికి, రఘునందన్​ రావు రాజకీయ ప్రస్తానం  తెరాసతో నే  మొదలయింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇమడలేదక ఆయన  భాజపాలోచేరారు. కీలక నేతగా మారారు.
చిన్నతనం నుంచి రాజకీయాలపై ఆయన మంచి అవగాహన ఉంది.  డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఇపుడు ఆయన కెసిఆర్, హరీష్ ఇలాకాలో బలమయిన ప్రతిపక్ష గొంతుకగా మారే అవకాశం ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రఘునందన్ ఎల్​ఎల్​బీ పట్టా పొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి చేరబోతున్నది.
హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ఉమ్మడి మెదక్​ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లాలో రఘునందన్​ రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. సిద్దిపేటలో బీఎస్సీ చేసిన రఘనందన్​ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్​.ఎల్​.బీ పూర్తి చేశారు.
అనంతరం ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్​ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు.
రెండుసార్లు ఓటమి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం నుంచి రఘునందన్​ రావు పార్టీలో కీలకంగా పని చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండయ్యారు.. భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో విజయం సాధించే దిశలో దూసుకుపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *