అమరావతి రాజధానికి మద్దతుగా రాజధాని ప్రాంతంలోని గొల్లపూడిలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన జరిగింది.
అమరావతి రాజధానినిర్మాణానికి శంకు స్థాపన చేసి సరిగ్గా అయిదేళ్లయింది. ఇపుడు వైసిపి ప్రభుత్వం అమరావతి రాజధానిని రద్దు చేసి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువస్తున్న సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజధానులు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించింది.
రాజధాని అమరావతికై శంఖుస్థాపన చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక 1 సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద గొల్లపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మూడు రాజధానులు నిర్ణయాన్ని జగన్ మార్చుకునేలా మనసు ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
సీఎం జగన్ అమరావతినే ఏకైక రాజధానిగా ఉండేలా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు
మూడు రాజధానుల నిర్ణయంతో జగన్ రెడ్డి 5 కోట్ల ప్రజలు భవిష్యత్‌ను తలకిందులు చేశారని చెబుతూ వారు మూడు ముక్కల రాజధానికి వ్యతిరేకత తెలిపారు.
స్వార్ధ రాజకీయాలతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారని ఆరోపిస్తూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.