పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రకటన చేసి ముసలికన్నీలు కారుస్తే సరిపోదు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలి.
పంజాబ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో కొత్త చట్టాలు రూపొందించాలి.
సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 28న సూచించినట్టుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ఆధారంగా రాష్ట్రంలో కొత్త చట్టాలు తెచ్చి రైతులకు కనీస మద్దతు ధరకు భరోసా నియ్యాలి.
రాష్ట్రం తెచ్చే ఈ రైతు చట్టాల ఏకగ్రీవ ఆమోదానికి, ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి సూచనమేరకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది.
తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీలో కోరినట్టుగా అకాల వరదలకు నష్టపోయిన పంటలకు ప్రతి ఎకరాకు రూ. 20 వేల నష్టపరిహారం అంధించి రైతులను ఆదుకొని ప్రతి పంట, ప్రతి గింజ కనీస మద్దతు ధరకే కొనే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి.
తక్షణమే ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటుచేసి రైతులపట్ల చిత్తశుద్ధి చాటుకోవాలి.