సీమ వలస రైతుల దుఃఖ ప్రవాహం: ‘అందనంత దూరం’ కథ సమీక్ష

(చందమూరి నరసింహారెడ్డి)
కరోనా సమయంలో జరిగిన యదార్థ సంఘటనలు ఈకథలో కళ్ళకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. రచయిత డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి మల్లయ్య, కరెక్కల లోకి పరకాయ ప్రవేశం చేసి తానే ఆ హృదయ విదారకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నట్టు అన్పించింది. రచయిత భావొద్వేగం , బాషవ్యక్తీకరణ ,సంఘటనల చిత్రీకరణ చదువుతున్న నాకు కన్నీళ్లు తెప్పించాయి. కన్నీటిసుడులను ఆపుకోలేక పోయాను. రాయలసీమ కరవు పరిస్థితులు ప్రతిబించాయి. మల్లయ్య వలస పోవడానికి ముందు రోజు పొలం చుట్టూ తిరగడం ఆభాద రైతులకు ఏమేరకు ఉంటుదన్నది తెలుపుతోంది.

కథ : అందనంతదూరం

రచయిత: డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

ప్రచరణ: సాహిత్య ప్రస్థానం, జూన్ నెల సంచిక 2020


వలస వెళ్ళేరోజున పిల్లల మానసిక స్థితి , భార్య భర్తల ఆక్రందన , ముసలమ్మ ఆవేదన తెలిపిన తీరు బాగుంది. రెండోసారి లాక్ డౌన్ అనగానే లక్షలాది మంది వలస కార్మికుల గుండె గుభేలు మనడం వాస్తవం. వేలమంది కార్మికులు వందలాది కిలోమీటర్లు నడచి అష్టకష్టాలు పడి స్వంతవూరు చేరుకొన్న తీరు ఈ కథలో కన్పిస్తుంది. మల్లయ్య , కరెక్క సొంత ఊరు చేరుకోవడానికి నడక సాగించడం ఆ ప్రయాణం లో వారెదుర్కొన్న కష్టాలు చదువుతుంటే కన్నీటి సుడులు ఆపులేక పోయాను. బాగ బతికన వేలాది కుటుంబాల పరిస్థితి నేడు ఈకథలోని మల్లయ్య కుటుంబం లా మారిపోయాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. దారిలో చెప్పు తెగిపోవడం , జ్వరం రావడం పడిన కష్టం గురించి వివరించిన తీరు అధ్బుతంగా ఉంది. ఓ ఇంటి వారు భోజనం పెట్టడం సద్ది కట్టివడం వల్ల ఇంకా మానవత్వం బతికిందని చెప్పడమే. కష్ణాజలాలు తరలిస్తే రాయలసీమ సీమ సస్యశ్యామలం అవుతుందని తెలియజేయడానికి ఆఖరులో చేసిన ప్రయత్నం చైతన్యం కలిగించి ప్రజా ఉద్యమం నిర్మించడానికి దోహదపడుతుందన్న రచయిత ఆశకు శతకోటీ వందనాలు.
ఆద్యంతం కథ చదివించేలా రాసిన అప్పిరెడ్డి హరినాథరెడ్డి కి నా అభినందనలు. నాకంటే చిన్న వాడు కావున ఆశీర్వాదం తెలుపుతున్నా. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీ కలం నుంచి జాలువారాలని ఆశిస్తున్నా.

 

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత)