హైదరాబాద్ శనివారం సాయంకాలం భారీ వర్షం మొదలయిది.
రెండ్రోజులు పాటు గ్యాప్ ఇచ్చిన వర్షాలు హైదరాబాద్ లో మళ్లీ దంచి కొడుతున్నాయి.
కొద్ది సేపటి నుండి ఎల్ బి నగర్, మలక్ పేట, లక్డీ కపూల్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం మొదలయింది.
అమీర్ పేట, పంజా గుట్ట, కూకట్ పల్లి మొదలగు చోట్ల కూడా కుండ పోత కురుస్తుండడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
ఇక మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా అక్టోబర్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
దీంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్ని చోట్ల, రేపు మరియు ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
ఎల్బీనగర్ ,వనస్థలిపురం,హయత్ నగర్ ,బి,ఎన్ రెడ్డి నగర్ లో ఈ వార్త రాస్తున్నపుడు కుండపోతగా భారీ వర్షం కురుస్తున్నది. రోడ్లన్నీ కాలువలయ్యాయి.
దీనితో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి.
ఎల్బీనగర్ నుండి విజయవాడ వెళ్లే రహదారిలో భారీ ట్రాఫిక్ జాం.
ఇక్కడి చైత్యన పూరి కమలా నగర్ రోడ్డు నెంబర్ 5 లో భారీ వర్షానికి ఒక వరద ముంచెత్తింది. వరద లో కొట్టుకు పోతున్న నలుగురిని స్థానిక ఫ్రిజ్ మెకానిక్ జింకా నరేష్ మిత్రుల సహాయంతో కాపాడాాడు.