సక్సెస్ ఫుల్ కిచెన్ స్టోరీ… వంటింటి చేతి వాటం అమెను పాపులర్ బ్రాండ్ చేసింది

మిలియనీర్ బిలియనీర్ కావడమే సక్సెస్ స్టోరీ కాదు, బజార్లో బండి మీద బజ్జీలమ్ముతూ ‘బ్రాండ్ ’ అయి పోయిన ప్రతిసాధారణ మనిషీ ఉత్తేజ పరిచే ఒక సక్సెస్ స్టోరీయే. ఒక భారీ ఉమ్మడి కుటుంబానికి వంట చేసిన అపార అనుభవమున్న  ఒక గృహిణి ‘బ్రాండ్’ గా మారిపోతే, శాల్యూట్ చేయాల్సిందే. ఈ రోజు గులాబ్ భండారీకి శాల్యూట్…
పై ఫోటోలో ఉన్న మహిళే గులాబ్ భండారీ. వయసు 70 సంవత్సరాలు. రిటైర్ మెంటనేది తెలియదు.  ఆమె బతుకు బండి పరుగుపెడుతూ ఉంది. దూసుకుపోతూ ఉంది. 1994లో మొదలయిన ఆ పరుగు అదే వేగంతో సాగుతూ ఉంది.రోజులు గడిచే కొద్ది బండికి అలసట రావడం లేదు… దానికి బదులు  బండి ఎపుడూ కొత్త మలుపులు తిరుగుతూ ఉంది.
 ఈ రోజు గులాబ్ భండారి ‘గులాబ్స్‘ బ్రాండ్ గామారింది. ఆమె తయారు చేసిన పానీయాలు, మిఠాయిలు, పొడులు, రొట్టెలు పెద్ద వ్యాపారమయ్యాయి. ఇపుడామె కంపెనీకి వోనర్ అని గర్వంగా చెప్పుకోగలదు. ఎంతో మందికి ఉద్యోగాలూ ఇచ్చింది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, ఒకపుడు వంటిల్లే సర్వస్వంగా, ప్రపంచంగా బతికిన గులాబ్  జీవితం  ఎపుడు కొత్తబాట పట్టింది? ఆ ఆలోచన ఎలా వచ్చింది.

 

సక్సెస్ స్టోరీలన్నీ చూస్తే  అన్నింటా ఒక మెలిక కామన్ గా కనబడుతుంది. ప్రపంచం అందరికి సమానాంగా అవకాశాలిచ్చినా  కొందరే వాటిని పసిగట్టి పట్టి, కళ్లెం వేసి స్వారీ చేసుకుని పోతారు. నిన్న మురళీ గుండన్న, నేడు గులాబ్ కథలు దీన్ని రుజువు చేస్తాయి.

దీని వెనక చాలా ఆసక్తికరమయి, ఉతేజకరమయిన స్టోరీ ఉంది. ఇంట్లోకి అవసరమయిన మసాలాలు, పొడులు, స్వీట్లు చేస్తూ వచ్చిన భండారీ ఈ రోజు  మోస్ట్ సక్సెస్ ఫుల్ హోంఆంట్రెప్రెన్యూర్  (Home Entrepreneur) అయ్యారు. సాధారణమనుషుల అసాధారణ విజయం  అంటే ఇదే.
అసలీ గులాబ్ కథేంటి?
గులాబ్ భంఢారీ అందరిలాగే సాదాసీదా గృహిణి. చెన్నైలో ఉంటుంది. ఆమె కుటుంబం రాజస్థాన్ నుంచి చెన్నైకి వలస వచ్చింది.  వాళ్ల కుటుంబం బతుకుదెరువు కోసం దక్షిణ భారత మహానగరానికి  కొచ్చి  స్థిరపడింది.  చూస్తుండగానే ఆకుటుంబం 60 మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబమయింది. వాళ్లకు ముప్పూటలా తండి అందించడమంటే అదెంత బృహత్తర కార్యక్రమమో చెప్పొచ్చు. అయింట్లో మహిళలు ముప్పొద్దులా ఎంత పనిచేస్తుంటారో వూహించవచ్చు.

Like this story? Share it with a friend!

ఇలాంటి ఉమ్మడి కుటుంబం కిచెన్ లో ఆమె జీవితం మొదలయింది. అంతకు ముందు ఇంటి దగ్గిర అమ్మ వంటలు చేస్తున్నపుడు చూస్తూ, సాయం చేస్తూ తాను, వంటలు నేర్చుకుంది. పెళ్లయ్యాక అదే పనయింది. ఆతర్వాత అదొక  పెద్ద వ్యాపకమయింది. ఇంట్లో కొత సభ్యులు పెరిగికొద్ది రుచులు మారడం మొదలయింది. వాటికి తగ్గట్లు గులాబ్ స్కిల్ అప్ డేట్ చేసుకునేది. కిచెన్ లో కొత్త  కొత్త ప్రయోగాలు జరిగేవి. కొత్తవంటలు తయారయ్యేవి. వాటికవసమయిన మసాలు ఇంట్లో దంచాల్సి వచ్చింది. దీనితో గులాబ్ కి వంట పనిలో  థ్రిల్ కనిపించింది. అరవై మంది ఉన్న ఇల్లంటే…  మూడు తరాలున్నా ఇంటికిందలెక్క. మూడు తరాల రుచుల అభిరుచుల మేళవింపు గులాబ్ బాధ్యతయింది. అయితే, ఈ ప్రయోగాలన్ని ఇంటికే పరిమితం. అయితే,  ఒక దశలో ఉమ్మడి కుటుంబం విడిపోకతప్పక  లేదు. అపుడు గులాబ్ తను నేర్చుకున్న కిచెన్ నాలెడ్జ్ ని ఏదోవిధంగా ఉపయోగించుకోవాలనిపించింది. తనకుతెలిసిన మసాల పొడులను, షర్బత్ లను తయారు చేసి స్నేహితులకు, ఇరుగుపొరుగుకు విక్రయించడం మొదలుపెట్టింది. కళ్లెదుటే తయారవడం, స్వచ్ఛంగా ఉండటం,ఫ్రష్ గా ఉండటంతో అన్నింటికంటే ముఖ్యంగా హోమ్ మేడ్ రుచి ఉండటంతో గులాబ్ పొడులకు డిమాండ్ పెరిగింది. ఆమె పొడుల గురించి మసాలలగురించిన సమాచారం ఈ నోటా ఆ నోటా పడి బాగా ప్రచారమయింది. ఇంటికి వచ్చి కొనుక్కుని పోయేవారి సంఖ్య పెరిగింది.
ఆమె వంటల్లో బాగా పాపులర్ గుజరాతి ఖాఖ్రా. ఖాఖ్రాఅంటే ఏదో  కాదు, ఒక రొట్టె. మెంతికూరతో చేస్తారు, జీలకర్రతో చేస్తారు. మొత్తానికి ఆమె గుజరాతి రుచులను చెన్నై ప్రజలకు పరిచయం చేశారు. గుజరాతీ, రాజస్థాన్  వాళ్లే కాదు, స్థానికులు కూడా ఆమె దగ్గిర కొనడం మొదలయింది.
Read this also
*అమ్మమ్మ వంటకాలతో మ్యాజిక్ … సాప్ట్ వేర్ జాబ్ వదిలేసిన సాహసి
కోడలు ప్రయత్నాలకు అత్త అసాధారణం సంప్రాదాయిక విజ్ఞానం కూడా తోడయింది.  రెండు తరాల అత్తా కోడళ్ల చేతులు పడటంతో వాళ్ల వంటలు పర్ ఫెక్ట్ గా మారాయి. ఎంత మసాల వాడాలి, ఎపుడు వాడాలి, ఏ దినుసులు ఎంతమోతాదులో వాడాలి… ఇలా ‘ మాఆత్త కచ్చితంగా చూపించేది. పాతతరం, సాంప్రదాయిక రుచి ఏ మాత్రం మిస్సవకుండా ఉండటంలో ఆమ హస్త వాసి ఉంది,’ అని గులాబ్ అంగీకరిస్తుంది.  ఇలా ఇంతవరకు కుటుంబ సభ్యలు నుంచి ప్రశంసలందుకుంటూ వచ్చిన గులాబ్ ఇపుడు చెన్నై ప్రశంలందుకుంటూ ఉంది. అయితే, ఇదంతా ఇరుగుపొరుగు, స్నేహితులు, కొంతమంది బంధువులకే పరిమితయింది. అయితే, నవీన్ రావడంతో గులాబ్ వ్యాపారం కొత్త మలుపుతిరిగింది. నవీన్ గులాబ్ మరిది కొడుకు. అతనికి ఒక సాఫ్ట్ వేర్ స్టార్టప్ ఉండింది. దాన్ని వేరే కంపెనీకి అప్పచెప్పి వచ్చిన డబ్బుతో మరేదయిన ప్రయోగం చేయాలనుకుంటున్నాడు.
ఇలాంటపుడు పిన్ని చేస్తున్న వ్యాపారం  మీద ఆయనకు అసక్తి పెరిగింది. ఆ బిజినెస్ లో చేరి విస్తృతం చేస్తే ఎలా ఉంటుందునుకున్నాడు. గులాబ్ మాసాలాలను,పొడులను, షర్బత్ లను ఎలా తయారు చేస్తుందో జాగ్రత్తగా గమనించాడు. కొనడానికి వస్తున్న కస్టమర్లను గమనించాడు. వాళ్ళ నుంచి అభిప్రాయలు , సలహాలు తీసుకున్నాడు. పిన్ని చేసే చిన్న బిజినెస్ లో  పెద్ద అవకాశం ఉందని గ్రహించాడు.  పిన్నితో చేతులు కలిపాడు. 2015 దీపావళి గులాబ్ జీవితానికి కొత్త కాంతులుతీసుకు వచ్చింది. ‘గులాబ్స్’ బ్రాండ్  రిజిస్టరయింది. ఇది అనుకోని మలుపు. తన స్టాఫ్ట్ వేర్ స్టార్టప్ అమ్మితే వచ్చిన డబ్బును నవీన్ గులాబ్  బ్రాండ్ మీద ఇన్వెస్ట్ చేశాడు.
Gulab Team
గతంలో ఆమె గృహిణిగా ఉన్నపుడు ఎపుడూ తన చేతిలో ఉన్న కళ ద్వారా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనే రాలేదు. తన చేసిన పొడులు  మసాలాలు ఇరుపొరుగుకు అమ్ముతున్నపుడు కూడా ఆమెకు ఇందులో ఏదో బిజినెస్ దాక్కుందని కూడా అనిపించలేదు.మార్కెట్ నుంచి సరుకులు కొనుక్కురావడం, పొడిగొట్టడం, విక్రయించడం తప్ప అదొక వ్యాపారమనే ఆలోచనేలేదు. ఏరోజు తాను లెక్కలు కూడా రాసుకోలేదు. నాలుగు డబ్బులొస్తే ఇంట్లో ఏదో ఒకవస్తువు కొనడమే తప్ప ప్రాఫిట్ ధోరణితో ఎపుడూ చూల్లేదు.  నవీన్ ప్రవేశంతో  ‘హోంషెఫ్’ ఏకంగా ‘హోంప్రిన్యూర్’ గా అవతారమెత్తింది.
నవీన్ గుజరాత్ నుంచి యంత్రాలు తెప్పించి గులాబ్ ప్రాడక్ట్స్ ను అందంగాప్యాకేజీ చేయడం మొదలుపెట్టారు. దీనితో ఇళ్లు ఇరుకున కార్ఖానా అవసరమయింది. ఒక ఏడాది కల్లా ‘గులాబ్’ బ్రాండ్  మార్కెట్లోకి విడుదలయింది. మిషన్లొచ్చాక కూడా తన  అత్త చెప్పిన మోతాదు ప్రకారమే సరుకులన్నీ తయారయ్యేలా దగ్గిరుండి గులాబ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. గులాబ్ బ్రాండ్ తో దొరికే సరుకుల సంఖ్య పెరిగింది. దేశంలో ని అన్నిప్రాంతాలకు గులాబ్ ఉత్పత్తులు వెళ్తున్నాయి. విదేశాలకు వెళ్తున్నాయి.  ఖాఖ్రా లే కాదు, ఉప్మా, ఊరగాయలు, నన్నారి వంటి వి కూడా చేరాయి. దాదాపు 30రకాల ‘గులాబ్’ ఉత్పత్తులు  ఇపుడు ఆన్ లైన్ లో తెప్పించుకోవచ్చు. తొందర్లో మరొక 50 ఉత్పత్తులను చేర్చే ప్రయత్నంజరుగుతూ ఉంది.
గులాబ్ బ్రాండ్ ఉత్పత్తులేమిటో ఇక్కడ చూడవచ్చు.

(Pictures credit: Gulabsfood  facebook)