శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలను నిషేధించండి: టిటిడి ఇవొ జవహర్ రెడ్డికి తిరుపతి యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం నిత్యం గోవిందనామ స్మరణతో మారుమ్రోగే తిరుమల శ్రీవారి సన్నిధి అధికార,ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శలకు,ప్రతివిమర్శలకు సవాళ్లకు ప్రతి సవాళ్లకు వేదికగా మారింది!
రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న కొంతమంది స్పీకర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నాయకులు శ్రీవారి దర్శనానంతరం పనికట్టుకుని ఆలయం ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆలయ పవిత్రతకు భంగం కాదా?
శ్రీవారి ఆలయ పవిత్రతను,భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో పూర్వం అమలులో ఉన్న పంచాయతీ ఎన్నికలను సైతం రాష్ట్రప్రభుత్వ సమన్వయంతో నిషేధించి టిటిడి లో విలీనం చేశారు!
తిరుపతి పార్లమెంట్,శాసనసభ ఎన్నికలలో బాగంగా తిరుమలలో కేవలం ఇంటింటి ప్రచారానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు!
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, ప్రచారాలు,పార్టీల జెండాలు, కండువాలు,బ్యాడ్జీలను ఇప్పటికే టీటీడీ నిషేధించింది పొరపాటున ఎవరైనా తీసుకువస్తే అలిపిరి టోల్ గేట్ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు వాటిని తొలగిస్తున్నారు!
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి గారు ఆలయం ముందు భాగంలో రాజకీయ ప్రసంగాలపై కఠినమైన ఆంక్షలు విధించండి!
అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించాలి అనుకుంటే తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే శ్రీవారి భక్తులకు ఎటువంటి అభ్యంతరమూ లేదు!
తిరుమల ఆలయం ముందు ఏ పార్టీ వారైనా సరే రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేయకుండా టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి ధర్మకర్తల మండలి సమిష్టి నిర్ణయంతో తీర్మానం చేసి వెంటనే అమలు చేయాలి!
(నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత, యాక్టివిస్టు , తిరుపతి)