ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ కూడా జస్టిస్ ఎన్ వి రమణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను తప్పు పట్టారు.
ఆయన భారతప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకి లేఖ రాస్తూ జస్టిస్ రమణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ లెక్కలోకి తీసుకోవద్దని కోరారు.
ఈ లేఖ దురుద్దేశంతో కూడుకున్నదని, కేవలం జస్టిస్ ఎన్ వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడు కాకుండా అడ్డుకోవడమేనని కూడా జస్టిస్ నౌషాద్ అలీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ చేసిన ఫిర్యాదుకు, రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులను సత్వరం విచారించాలని సెప్టెంబర్ 16,2020 న జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పుకు సంబంధం ఉందని తన లేఖలో జస్టిస్ నౌషాద్ అలీ పేర్కొన్నారు.
దాదాపు 31 అక్రమాస్తుల ఆర్జన కేసులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముదాయి అని,ఈ కేసులన్నీ సిబిఐ కోర్టు విచారణ చేస్తున్నదని, ఇవి కాకుండా మరొక 7 కేసులు ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ విచారణలో కూడా ఉన్నాయని ఆయన లేఖలో గుర్తు చేశారు.
జగన్ లేఖ టైమింగ్ ను మర్చిపోరాదని చెబుతూ జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ సెప్టెంబర్ 16 న ఇచ్చిన తీర్పు జగన్ కేసులకు కూడా వర్తిస్తుందని, అక్టోబర్ 6, ఈ బెంచ్ ఈ ట్రయల్స్ ను ఫాస్ట్ ట్రాక్ చేసేందుకు వీలుగా కొంత సమాచారం కూడా కోరిందని ఆయన చెప్పారు. జగన్ కూడా సరిగ్గా ఇదే రోజునే లేఖ రాశారని జస్టిస్ నౌషద్ అలీ పేర్కొన్నారు.
“The timing of the letter is worthy to be noted. Hon’ble Supreme Court through the Bench headed by Justice Ramana passed Order on 16.9.2020 to expedite trial cases, concerning politicians. On 6th October the Bench asked for some information to enable passing substantive Orders to fast track long-pending trials. The Chief Minister letter is also dated 6.10.2020, “ అని నౌషద్ అలీ తన లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్న అంశాలన్నీ ఇప్పటికే కోర్టు ల పరిశీలనలో ఉన్నాయని, ఇలాంటపుడు ఈ కేసులలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాయడంలో ఔచిత్యం లేదని, ఇది కోర్టుల స్వతంత్ర పనితీరును సవాల్ చేయడమేనని తన అభిప్రాయమని ఆయన లేఖలోపేర్కొన్నారు.
“The propriety and nature of the letter seeking the administrative intervention of the Hon’ble Chief Justice have to be examined in the light of the challenge of the same allegation on the judicial side of the court. In my humble opinion, petitioning for the administrative interference of the Hon’ble Chief Justice, when the court is seized of the matter on its Judicial Jurisdiction amounts to direct interference with the administration of Justice.”