హైదరాబాద్ సగం మునిగిపోయింది.లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ సముద్రమయింది. ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ప్రజలు ఇంత పెద్ద వానను ఎపుడూ చూల్లేదు. రెండురోజులు పాటు క్షణం ఆగకుండా వానలు కుండపోతగా కురిశాయి.
వాతావారణ శాఖ వివరాలు ప్రకారం గత 24 గంట్లో హైదరాబాద్ లో 192 సెంటిమీటర్లు వాన కురిసింది. అంటే 19.2 సెంటిమీటర్లున్నమాట.
ఎపుడో 1903లోమాత్రమే ఇంత పెద్ద వాన పడింది. మళ్లీ ఇదే అంటున్నారు. ఆయేడాది అక్టోబర్ 6 వ తేదీన 117.1 మి.మీ వర్షం కురిసింది. అదితప్ప ఇటీవలి కాలంలో ఇంత పెద్ద వాన పడేలేదని అధికారులు చెబుతున్నారు. 2013లో కురిసిందే పెద్ద వాన. ఇక పోతే 2013లో ఒక సారి భారీ వర్షాలు వచ్చాయి. అపుడు 98.3 మి.మీటర్లు వాన కురిసింది. దానికి సిటీ తలకిందలుయింది.
గత 24 గంటల్లో హైదరాబాద్ పరిసరాల్లో కురిసిన వర్షాలకు సంబంధించి పోచంపిల్లిలో రికార్డు స్థాయిలో 252.4 మి.మీ వర్షం నమోదయింది. రాష్ట్రంలో విపరీతమయిన వర్షాలు కురియడంతో ప్రభుత్వం 14, 15 తేదీలలో శెలవులు ప్రకటించింది. ఇంకా వర్షం కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ షాక్ తో డాక్టర్ మృతి
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీలో విషాదం నెలకొంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సెల్లార్లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు.. డాక్టర్ సతీష్ రెడ్డి మోటార్ వేసేందుకు వెళ్లాడు. మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్తో డాక్టర్ మరణించాడు. దీంతో మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Many friends from across the country have been asking me about floods caused by incessant rain in Hyderabad. Thank you 🙏 All for concerns. So far, all near and dear are safe. This clip best shows the extent of the disruption on roads. #HyderabadRains pic.twitter.com/ZKynsTlHXN
— Manoj Kumar (@manoj_naandi) October 14, 2020
Most frightening video of a man being washed away in the force of the flood waters at #Barkas near #Falaknuma; not very sure if he could be rescued; unimaginable that regular roads can look like fast-flowing streams #HyderabadRains; video shared by Ruby channel @ndtv @ndtvindia pic.twitter.com/iS1LvvZ6ki
— Uma Sudhir (@umasudhir) October 14, 2020
Heavy water flow at Falaknuma RUB. Kindly take alternate road and avoid this route till the water recedes.@HYDTP pic.twitter.com/fKOnXse8np
— Anil Kumar IPS (@AddlCPTrHyd) October 14, 2020