షుగర్ ఉన్నవాళ్లు మామిడి పండ్లు తినొచ్చా? వాళ్లు నిర్భయంగా తినాల్సిన పళ్లేమిటి? పాయసం తింటే ఏమవుతుంది? ఇంట్లో అంతా అన్నీ తింటున్నపుడు షుగర్ ఉన్న వాళ్లను దూరంగా వుంచవచ్చా? షుగర్ ఉన్నవాళ్లు భయపడకుండా తీసుకోదగిన ఆహార పదార్థాలేమిటి?
డాక్టర్ జతిన్ కుమార్
షుగర్ ఉందని చాలా మంది ఇళ్లలో నోటికి బీగం వేస్తుంటారు. చాలా ఇళ్లలో షుగర్ ఉన్నవాళ్లు మీద ఆహార అణిచివేత అమలు చేస్తుంటారు. ఏది తినాలన్నీ షుగర్ ఉందని ముట్టుకోవద్దని ఆంక్షలు పెడుతుంటారు. దీనితో షుగర్ ఉన్న వాళ్లు జిహ్వచాపల్యానికి, అణచివేతకి మధ్య నలిగిపోతుంటారు. ఏవీ తినలేకపోతుంటారు.
దీనివెనక సదుద్దేశమే ఉన్నా డయబీటిస్ ఉన్నవాళ్ల అంతగా కఠిన ఆంక్షల మధ్య జీవించాల్సిన అవసరం లేదు.
దీనికి కారణం, షుగర్ గురించి సరైన అవగాహన లేకపోవడమేకారణం. షుగర్ అనేది సంపూర్ణ నిషేధ ప్రాంతం కాదు. మధుమేహం ఉన్నంతా మాత్రాన దేన్నితినరాదని అనవసరం ఆంక్షలు పెట్టుకోనవసరం లేదు. కాకపోతే కొన్ని నియమాలు పాటిస్తూ దేన్నయినా తినవచ్చు. మధుమేహం ఉన్నవాళ్లు అన్ని రకాల ఆహారాలను తీసుకోవచ్చని చెబుతూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అవేమిటో చూడండి.