అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలి నడక దారిలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఎండ తగలకుండా వానలో తడవకుండా పై కప్పు సిమెంట్ స్లాబ్ రూఫ్ లను సుమారు 7.5 కిమీ గతంలో టీటీడీ ఏర్పాటు చేశారు!
అలిపిరి నడక మార్గంలో కొన్నిచోట్ల సిమెంట్ రూఫ్ పెచ్చులు ఊడి పడిపోతున్నాయని టిటిడి అధికారుల విజ్ఞప్తి మేరకు రిలయన్స్ సంస్థ ఇస్తున్న 25 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న సిమెంట్ స్లాబ్ లను పూర్తిగా తొలగించే పనులు ప్రారంభించారు!
అలిపిరి నడక మార్గంలో సిమెంట్ కాంక్రీట్ రూఫ్ స్లాబ్ లను తొలగిస్తున్నారు దాని కారణంగా కాలినడకన తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు పాదరక్షలు లేకపోవడంతో పక్కనున్న మట్టి బాటలో నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు
అలిపిరి నడక మార్గంలో రూఫ్ కు చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే చేసుకొని పటిష్ట పరుచుకొని రిలయన్స్ దాతను విజ్ఞప్తి చేసి ఆ 25 కోట్లను “రుయా”తో పాటు “స్విమ్స్ లో వంద పడకల అదనపు క్యాజువాలిటీ భవన నిర్మాణానికి ఖర్చు చేస్తే బాగుంటుంది పదిమందికి ప్రాణదానం చేసిన వారు అవుతారు టిటిడి ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను
టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు ఈ విషయాలను పునరాలోచించాలి.