ఆంధ్రలో దారుణం, భూమి లాక్కున్న ఎమ్మార్వో, రైతు ఆత్మహత్య

ఆంధ్రలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు చాలా చోట్ల పేదల భూములే లాక్కుంటున్నారు. పక్కనే ప్రభుత్వభూములున్నా అనాది సాగుచేస్తుకుంటున్న భూములనే రెవిన్యూ సిబ్బంది ఎంపిక చేసి బెదిరించి లాక్కుంటున్నారు. ఈ భూముల జోలికి రాకుండా ఉండాలంటే భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి.
పేదలకు భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకటించారు. దీనికోసం ఎక్కడెక్కడి భూములను రెవిన్యూ వాళ్లు స్వాదీనం చేసుకుంటున్నారు. ఇది కొంతమంది అవినీతి రెవిన్యూ అధికారుల పాలిట వరప్రసాదిని అయింది. దశబ్దాలుగా సాగుచేసుకున్న చిన్నచిన్న చెలకలను పేదలనుంచి లాక్కుంటామని ఎమ్మార్వోలు బెదిరిస్తున్నారు. పక్కనే ప్రభుత్వ స్థలాలున్నా,  అరవై డెబ్బయి సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న కుటుంబాలను బెదిరిస్తున్నారు. వారు డబ్బిస్తే వదిలేస్తున్నారు. లంచం ఇవ్వకపోతేలాగేసుకుంటున్నారు. ఇలాంటి పేదలకు పట్టాలిచ్చి ఆదుకోవాలని గాని వాళ్ల  జీవితాలను లంచాలకోసం బలి చేయవచ్చా?. ఇలాంటిదారుణానికి చేనేత కుటుంబానికి చెందిన రైతు బలిఅయిన సంఘటన తుని నియోజకవర్గం లో జరిగింది. జరిగిందేమిటో మృతుడి భార్య కోసూరి కృష్ణవేణి వివరిస్తున్నారు.

తుని నియోజకవర్గ, తొండంగి మండలం, కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన లేటు కోసూరి నాగేశ్వరరావు గారి భార్య కోసూరి కృష్ణవేణి.
ఆమె చెబుతున్న వివరాలు:
మేము చేనేతకులనికి చెందిన వాళ్ళం. ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల ఇవ్వడం కోసం గ్రామంలో 14 ఎకరాల 15 సెంట్ల గ్రామ కంఠం భూమి ఉండగా , దాదాపుగా 80 సం.రాలుగా మాకు చెందిన 20 సెంట్ల భూమిని అన్యాయం గా తీసుకోవడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు సిద్ధపడ్డారు.  ఆభూమి ఆమెకు తండ్రి నుంచి సంక్రమించింది.
లేదంటే 2 లక్షల లంచం ఇవ్వమని డిమాండ్ చేశారు.
నా భర్త ఆ మొత్తం డబ్బును ఇవ్వలేను అనే సరికి రెవెన్యూ సిబ్బంది, RI , MRO, సర్వేయర్, VRO కలిసి JCB తో మా భూమిని అక్రమించేందుకు వచ్చారు.

నా భర్త మనస్తాపంతో నా భూమినే ఎందుకు తీసుకుంటున్నారు పురుగుల మందు తాగి చనిపోతాను అని వారి ముందే సెల్ఫీవీడియో ( ఆ వీడియో కింద పెడుతున్నాను)తీసుకున్నా, సరే ఛస్తే చావు అని రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో నా భర్త వారి ముందే పురుగుల మందు తాగాడు .
రెవెన్యూ సిబ్బంది వారి వాహనం లొనే నా భర్తను హాస్పిటల్ కి తీసుకెళ్లారు తర్వాత చనిపోయాడని అని మాకు చెప్పారు.
రెవెన్యూ సిబ్బంది, విఆర్ వో, రెవిన్యూ ఇన్స్ పెక్టర్ వల్లనే న భర్త చనిపోయాడు… నాకు న్యాయం చేయాలని హైకోర్టు ని ఆశ్రయించాను. సీఎం గారి, DGP, చీఫ్ సెక్రటరీ గారికి, తూ.గో కలెక్టర్ గారికి, SP గారికి, పెద్దాపురం RDO గారికి, పెద్దాపురం DSP గారికి నాకు నాయ్యం చేయాలని కోరాను.
హైకోర్టు స్పందిస్తూ మాకు లెటర్ కూడా పంపారు.
రెండు రోజుల తర్వాత MRO గారు గ్రామానికి చెందిన VRO, గుమస్తా, బారిక ఈ ముగ్గురును మా వద్దకు పంపించి సంతకాలు పెట్టకపోతే మీ కుటుంబం రిస్క్లో పడుతుంది అని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు.తర్వాత మాకు ఈ సంతకాలు కేస్ Withdraw  చేసుకుందుకు పెట్టించుకున్నారు అని తెలిసి వెంటనే పోలీవారిని ఆశ్రయించాను పోలీస్ వారు కూడా అదేం పర్వాలేదు అని ఈ విషయంపై యాక్షన్ తీసుకోనన్నారు.
దీన్నిబట్టి చూస్తే నాకు, నా కుటుంబానికి ఎక్కడ న్యాయం జరుగదు అనుకున్నాము. తర్వాత తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు గారిని ఆశ్రయించము, వారు మాకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారితో పాటు రాష్ట్రంలో బీసీ సోదరి సోదరులందరుకు నా న్యాయం పోరాటానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము.
ఇట్లు
కోసూరి కృష్ణవేణి

 

కృష్ణ వేణి వేదన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లుందా?   ఆమె కు న్యాయం జరుగుతుంది. పేదలందరికి ఇళ్లు పథకానికి ఇలా కృష్ణ వేణి కుటుంబంలాగా ఎన్నికుటుంబాలు బలవుతున్నాయో,  ముఖ్యమంత్రికి  ఎప్పటికైనా తెలుస్తుందా?