r(డాక్టర్ ఎస్ జతిన్ కుమార్)
డయాబెటిస్ (మధుమేహం) గురించి కొంచెం చెబుతాను.
దీన్ని అర్ధం చేసుకోవడానికి రెండు కోణాలున్నాయి. వ్యాధి పీడితులైన వ్యక్తుల కోణం నుండి ఒకటి, రెండవది వైద్యుల కోణం నుండి. .
ప్రజలు దేనికైన చికిత్స పొందేటప్పుడు తనరోజువారీ సాధారణ జీవన శైలి లో కనీస మార్పులు ఉంటెేనే దీర్ఘకాలం దాన్ని అనుసరించ గలుగుతాడు. జీవితం సాధ్యమైనంత సాధారణమైనదిగా ఉండాలని కోరుకుంటారు.
ఆహార నియమాలు పాటించ వలసి ఉంది కనుక ఈ విషయం తప్పనిసరిగా పరిగణించాలి. సూచనలు, సలహాలు ఆ యా ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉండాలి.
తగిన మోతాదులో, పరిమితులలో తినగలిగితే మధు మేహులు ఏ పదార్ధాన్ని పూర్తిగా మానివేయ వలసిన అవసరం లేదు.
మందులు లేకుండా మధుమేహాన్ని నియంత్రించవచ్చు, అలా జరగాలి అంటే మీరు జీవన విధానంలో చాలా కచ్చితంగా మరియు నియమబద్ధంగా ఉండాలి. మీరు 60 సంవత్సరాల పూర్వం ఉన్న ఆహార విధానం మరియు పని శైలిని వర్తింపజేయండి. మలవిసర్జన కోసం వారు కనీసం 2 కి.మీ.ల గ్రామం నుండి బయటికి వెల్లేవారు యంత్ర శక్తి కంటే తమ శరీరశక్తిని , స్వయం చాలిత సామగ్రి కంటే సాధారణ పనిముట్లు వాడేవారు. శారీరక శ్రమ కూడా ఎక్కువ. వారు చేసే అన్ని శారీరక పనులను లెక్కించండి.
ఇక స్త్రీలు,పొలాలు, ఇంటి పనులలో నిమగ్నమై ఉండే వారు. రోజు మొత్తం చెమటలు పట్టేలా పనిచేస్తుండే వారు. అందువల్ల కేలరీలు ఖర్చుఅయ్యేవి. కాలానుగుణమైన మార్పులతో వారు వివిధ రకాల తృణధాన్యాలు, పప్పుధాన్యాలతో 2 లేదా 3 సార్లు ప్రధాన ఆహారాన్ని తీసుకునే వారు.
ఆ రోజుల్లో స్నాక్స్, ఎరేటెడ్ డ్రింక్స్ , (కోలా వంటి సీతలపానీయాలు)లేదా జంక్ ఫుడ్ ఎక్కువ ఉండేవే కాదు. ఇలా కేలరీలు తీసుకోవడం లో కనపడని నియంత్రణ ఉండేది.
కాబట్టి ఆహారం మరియు కార్యకలాపాలను సమతుల్యం చేయడానికి క్రమశిక్షణ గల మార్గం అనుసరించే వారు. దీనికి తోడు జీవితంలో ఆందోళన మరియు ఒత్తిడి ఖచ్చితంగా ఈ రోజు కంటే తక్కువగా ఉండేది.
మరియు వారికి భౌతికంగా విశ్రాంతి, మంచి నిద్ర, మానసికంగా సమతులనమైన జీవితం ఉం డేది. ఇది అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది.
ఈ పద్ధతి ఇప్పుడు చాలా మారిందని మీ అందరికీ తెలుసు. అదే వ్యాధులకి మూల కారణం.అసలు మధుమేహం అనేది ఒక జబ్బు కాదు. అది మన శరీర వ్యవస్థలో అసమతులనం.
అసలు కారణాన్ని సరిదిద్దడానికి బదులుగా మనం లక్షణాలను తగ్గించటం మీదదృష్టి పెడుతున్నాము.ఇది సహజ పద్దతులు పేరిట. వేపాకు, మెంతులు, అల్లం బెల్లం తినటం కావొచ్చు, లేదా నోటి ద్వారా తీసుకునే ట్యాబ్‌లెట్లు కావోచ్చు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ వంటివి కావచ్చు.అన్నీ తాత్కాలికమే.
ఇది వ్యాధి కానందున శాశ్వత నివారణ అంటూ లేదు. మీరు సమతుల్యతను కొనసాగించినంత కాలం మీరు సాధారణ జీవితం గడప గలరు .లేదా ఎప్పటికీ చికిత్సపై ఆధారపడి ఉండాలి.
ఇది జీవితకాల ప్రక్రియ కాబట్టి, ఒక వ్యక్తి విసుగు తో ఈ పద్దతి లేదా ఆ పద్ధతి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు .ఏ చికిత్స అయినా తాత్కాలికమే.
రక్తంలో చక్కెర స్థాయిలకు సంబంధించి చాలా అనవసరమైన గందరగోళం వ్యాప్తి చెంది ఉంది.
డయాబెటిస్ గురించి ఎందుకు ఆందోళన చెందాలి? ఎందుకంటే ఇది క్రమంగా మరియు నెమ్మదిగా అంతర్గత ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. దీనికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. నష్టానికి దారితీసే ఏకైక అతి ముఖ్యమైన అంశం హైపర్ గ్లైసీమియా.రక్తంలో అధిక చక్కెర స్థాయి. దానిని సరైన స్థాయిలో నిర్వహించాల్సిన అవసరం ఉంది.
అప్పుడు ప్రశ్న సరైన చక్కెర స్థాయి అంటె ఏమిటి?.. దీర్ఘకాలంలో అవయవాలకు హాని కలిగించని స్థాయి లో ఉండటం.
మీ చికిత్సను నిర్ణయించడంలో మీ వయసు, మిగిలి ఉన్న జీవిత కాలం ఒక ముఖ్యమైన అంశం ..
ఒక వ్యక్తి 60 ఏళ్లకు డయాబెటిక్‌గా మారినట్లయితే, సుమారుగా అతను 20 ఏళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి(80 సంవత్సరాలు సగటు జీవిత కాలంగా తీసుకున్టే).
రోగనిర్ధారణ తర్వాత 10 నుండి 15 ఏళ్ళ తరువాతనే సమస్యలు మొదలవుతాయి.
అదే అతను నిర్లక్ష్యంగా ఉంటే, 5 నుండి 6 సంవత్సరాలలో కళ్ళు మరియు మూత్రపిండాలు వంటి అవయవాలు దెబ్బతింటాయి.
40 సంవత్సరాల వయస్సులో నే డయాబెటిస్‌గా మారితే, అతను 40 సంవత్సరాలు జాగ్రత్త పడాలి, కాబట్టి అది ఎక్కువ కష్టంగా ఉంటుంది.