గుర్రం జాషువా విశ్వమానవత్వం కోసం పరితపించిన కవి. ఆయన కవిత్వం ఈ తాత్వికతకు మ్యానిఫెస్టో లాంటింది. ఆయన తండ్రి యాదవ. తల్లి మాదిగ. అయితే, ఎటూ వైపు వెళ్లకుండా, కులాలు మతాలు లేని మావనతా వాదం వైపు నడిచాడు. అదే అచరించాడు, ప్రబోధించాడు. ఆధనిక తెలుగు కవిత్వంలో ఈ మార్గంలో వైతాళికుడాయన. కళా ప్రపూర్ణ, పద్మభూషణ్ పురస్కారాలు ఆయనకు లభించాయి.
ఈ సంక్షోభ కాలంలో జాషువా ప్రబోధించిన విలువలను అంతా గుర్తిస్తున్నారు. అందుకే సర్వత్రా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఆయన పద్యాల్లోనుంచి కొన్ని మాటలు.
‘ సకల కార్మిక సమాజముల జీవిత కథా
నకము లాలించు కర్ణములు నావి
కఠిన చిత్తుల దురాగతములు ఖండించి
కనికార మొలికించు కలము నాది
దొడ్డ పదవుల నెక్కి గడ్డి మేసెడి వారి
నెత్తి పొడుచు చిత్త వృత్తి నాది ”
” కుల మత రాజకీయములకున్ గురిగాక
మంగళ కరమైన సత్యమును కమ్మని వాక్కుల
నిర్భయంబుగా బలికినదే కవిత్వము ”
” స్వర్గ నరకాలు రెండు జగతియందు
నరుడు సృష్టింప గలడని నమ్మగలను ”
” అన్నమునకు నీటి కంటు జాఢ్యంబన్న
చుప్పనాతి మతము గొప్ప దగునే? ”
” మత పిచ్చి గాని వర్ణోన్నతి గాని
స్వార్థ చింతనము గాని
నా కృతులందుండదు ”
”కలమును కులము తో గొలిచి బేరములాడు
వైషమ్య భావంబు వదలి వైచి ”
” అతడు వేమన , భువన మాయా తమస్సు జీల్చి
చెండాడిన బలశాలి! సిద్ద మూర్తి ! సకల సామ్రాజ్య
భోగ పిశాచములను గోచి పాత కు బలియిచ్చుకొన్న ఘనుడు ”
”జ్ఞాన మత సాంఘిక స్వేచ్చ నల్వురకును
నేక రీతి లాభించు నందాక రాదు
భావి భారత కళ్యాణ సుఖము ”
“పామునకు పాలు చీమకు పంచదార,
మేపుకొనుచున్న కర్మభూమింజనించు
ప్రాక్తనబైన ధర్మదేవతకు కూడా
నులికపడు జబ్బు కలదు వీడున్న చోట”