గత కొద్ది రోజులుగా తెలంగాణ లో విపరీతంగా వర్షాలు వస్తున్నాయి. దీనితో నదులు, సెలయేర్లు,కుంటలు వరదపొటెత్తాయి. ఈ ఫోటో కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించింది. అక్కడి జైనూర్ మండల పరిస్థితి ఇది. ఇక్కడ చాలా గ్రామాలకు సరైన రోడ్డు వసతి ఉండదు.వైద్యానికి కూడా మైళ్లు నడవాల్సి ఉంటుంది. ఇపుడయితే అసలే వర్షాలు. ఇలాంటి పరిస్థితిలో చింతకార గ్రామంలో చిన్న బాలునికి జ్వరం వచ్చింది. బాలుని సమీపంలోకి మండలం కేంద్రం ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. అక్కడి వాగులన్ని పొర్లిప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాను గుర్తుకు తెస్తూ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో బాలుని చేతులపై ఎత్తుకుని వాగు దాటారు గ్రామస్థులు.
(సోర్స్ : వాట్సాప్ )