ఓటీటీలలో ఇప్పటివరకు విడుదలైన డైరక్ట్ చిన్న సినిమాలు కానీ, పెద్ద సినిమాలు కానీ చెప్పుకోదగసక్సెస్ కాలేదు. నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీ భావించగా ‘వి’ అంచనాలను అందుకోలేక బోల్తాపడింది. .థియేటర్లలో ‘వి’ సినిమా రిలీజై ఉంటే దాదాపు పది కోట్ల రూపాయల వరకు దిల్ రాజుకు నష్టం వాటిల్లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.సర్లే జరిగిందేదో జరిగింది..అని దిల్ రాజు రిలీఫ్ అయ్యేలోగా కొత్త సమస్య వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతోంది.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు… ‘వి’ సినిమా ఫ్లాప్ కావటంతో ఆ సినిమాని భారీ రేటుకు కొనుక్కున్న అమెజాన్ వారు కొంత మొత్తం అయినా వెనక్కి ఇవ్వమని..ఎంతో కొంత కాంపన్షేషన్ ఇచ్చి సెటిల్ చెయ్యమంటున్నారట. గతంలో సినిమాలు ప్లాఫ్ అయ్యినప్పుడు ఈ తరహా వెనక్కి ఇచ్చే స్కీమ్ లు మొదలయ్యాయి. రజనీ, కమల్ వంటి స్టార్స్ సినిమాలకే ఆ వేడి తప్పలేదు.
ఇక అమెజాన్ కు చెందిన ఎంప్లాయిస్ ..మేము కష్టపడి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని మా కంపెనీ లో పై వాళ్లను ఒప్పించి, మీకు అంత పెద్ద మొత్తం ఇప్పించాం. ఇప్పుడు చూస్తే మా ఓటీటికు కొత్త సబ్ స్కైబర్స్ ఈ సినిమా వల్ల పెరగలేదు సరికదా…రెగ్యులర్ గా ఉన్నవాళ్లు కూడా చూడలేదు. మొత్తం లాస్ అయ్యాము. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మమ్మల్ని ఒడ్డున పడేయాలి. లేకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా మా ఉద్యోగాలపై ఉంటుంది అంటున్నారు. అయితే దిల్ రాజు మాత్రం… నెక్ట్స్ సినిమాలో చూసుకుందాం. మా బ్యానర్ లో వచ్చే నెక్ట్స్ సినిమా తక్కువ రేటుకు ఇస్తానని చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ కూడా అయిన ఆయనకు ఈ కష్టాలు తెలియకపోవు..కరణిస్తే బాగుండును..లేకపోతే రేపు..మా సినిమాలు కూడా అంతంత రేటు పెట్టి తీసుకోవటానికి ఓటీటిలు ముందుకు రావు అని మిగతా నిర్మాతలు దేవుళ్లకు దణ్ణాలు పెడుతున్నారట.
నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.