జీవితంలో కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు అవి పెద్ద తప్పులుగా కనపడవు. ఆ ..మనను ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటాం. కానీ ఒక్కసారి పట్టుబడ్డారా….అంతే…మొత్తం జీవితం కళ్ల ముందు కనపడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అప్పుడు పశ్చాత్తాప పడినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అలాంటి ఓ పెద్ద క్రైమ్ చేసాడు అమెరికాకు చెందిన రోన్ జెరిమీ. ఒక మామూలు సినీ నటుడిగా తన జీవితాన్ని మొదలు పెట్టిన రోన్ జెరిమీ (Ronald Jeremy Hyat) ఆ తర్వాత మెల్లిగా అడల్ట్ సినిమాల వైపు ఆకర్షితుడయ్యాడు. అమెరికా లో ఎవరైనా సరే హాలీవుడ్ లో ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని తమ కెరీర్ మొదలుపెట్టిన అతను తనకు తెలియకుండానే అతి తెలివితో దారి తప్పాడు. తను చేసింది తప్పుకాదనుకున్నాడు. రోన్ జెరిమీ హాలీవుడ్ లో నిలదొక్కుకోలేక అడల్డ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటరైన వాడు… మొదట కొన్ని సంవత్సరాల పాటు నటుడిగా అడల్ట్ సినిమాల్లో నటించాడు. అందులో పండిపోయిన తర్వాత రోన్ జెరిమీ మెల్లిగా అడల్ట్ సినిమాలకు దర్శకత్వం వహించడం అలాగే తానే నిర్మాతగా మారి సినిమాలు తీయడం కూడా మొదలు పెట్టాడు..
. అలా అతను చాలా తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల రూపాయల డబ్బు సంపాదించాడు… అయితే జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా అనుకోకుండా అతని మీద వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో అమెరికా, కాలిపోర్నియా సుపిరీయర్ కోర్టు అతనిని అరెస్టు చేసి తనకి 250 సంవత్సరాల జైలు శిక్ష పడే కేసులు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు రోన్ జెరిమీ జీవితం అతని కేసు అమెరికాలో ఒక పెద్ద సంచలనం… అసలు రోన్ జెరిమీ ఎవరు?
రోన్ జెరిమీ అమెరికాలోని న్యూయార్క్ లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు… తనకు చిన్నప్పటి నుంచే నటన మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఎక్కువగా సినిమాలు చూడటం… తను కూడా పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ లా అవడం అనేది తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు… అందుకు తగ్గట్టుగానే చిన్నప్పట్నుంచి పాటలు పాడటం డాన్స్ చేయడం లాంటివి బాగా నేర్చుకున్నాడు.
తనకు యుక్తవయసు వచ్చాక హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు… మొదట్లో తనకి చిన్నా చితక వేషాలు వచ్చినా కూడా నిరుత్సాహ పడకుండా తన ప్రయత్నాన్ని కంటిన్యూ చేశాడు… అయితే అలా దాదాపు పది సంవత్సరాలు గడిచినప్పటికీ రోన్ జెరిమీ హాలీవుడ్ లో ఎలాంటి గుర్తింపు రాలేదు… దానికితోడు తను ఆర్థికంగా బాగా ఇబ్బంది పడే వాడు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా గడిపిన రోజులు అతని జీవితంలో ఎన్నో ఉన్నాయి.
జీవితం ఒక పెద్ద ఫెయిల్యూర్ అని ఇంక ఇప్పటికీ హాలీవుడ్ లో గొప్ప నటుడి అయి మంచి పేరు తెచ్చుకోలేనని సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అని రోన్ జెరిమీ ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక స్నేహితుడి ద్వారా అడల్ట్ సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసింది… దాంతో అక్కడే అతని జీవితం పెద్ద మలుపు తిరిగింది.
సినిమా ఇండస్ట్రీ అనగానే ముందుగా కొంచెం సిగ్గుపడి భయపడి నటించడానికి ఇబ్బందులు పడ్డ రోన్ జెరిమీ ఆ తర్వాత మెల్లగా ఇదే తనకు కరెక్ట్ ఇండస్ట్రీ అనుకోని స్వేచ్ఛ గా నటించాడు. దాంతో అతికొద్ది రోజుల్లోనే అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో తాను గొప్ప పేరు సంపాదించుకున్నాడు.
I am innocent of all charges. I can’t wait to prove my innocence in court! Thank you to everyone for all the support.
— Ron Jeremy (@RealRonJeremy) June 23, 2020
కేవలం ఐదు సంవత్సరాల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి తర్వాత రోన్ జెరిమీ కానీ కొన్ని అడల్ట్ సినిమాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టాడు… తాను నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి… టైం బాగుండి తాను నటించిన, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా హిట్ అవుతూ ఎన్నో కోట్ల రూపాయలు అతనికి సంపాదించి పెట్టింది.
ఇక ఆ తర్వాత రోన్ జెరిమీ నిర్మాత గా కూడా మారుతూ కొన్ని వందల అడల్ట్ సినిమాలు తీశాడు. అయితే అలాంటి సినిమా ఇండస్ట్రీ కూడా కాలానుగుణంగా మారుతూ వస్తూ ఉండటంతో తన పోటీదారుల మీద గెలవడం కోసం రోన్ జెరిమీ 15 నుంచి 54 వయస్సు గల ఆడవారి తో సినిమాలు తీసే వాడు… అప్పుడప్పుడే టీనేజ్ లోకి వస్తున్న కొంత మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం ద్వారా వాళ్లని బెదిరించి భయపెట్టి సినిమాలో నటింపచేసే వాడు. ఇలా అతని దురాగతాలు కొన్ని సంవత్సరాలపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాయి.
అయితే చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో మైనర్ గర్ల్స్ ఎక్కువగా కిడ్నాప్‌నకు గురవుతున్నారు అని మీడియా సంస్థల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న అమెరికా ప్రభుత్వం వీటి గురించి ఆరా తీయాలని పోలీసు వారిని కోరింది… దాంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీస్ ఉన్నతాధికారులు కిడ్నాప్ అవుతున్న మైనర్ గర్ల్స్ ఎక్కువగా అలాంటి సినిమాల్లో నటిస్తున్న టు తెలుసుకున్నారు… అందులోనూ వారంతా ముఖ్యంగా రోన్ జెరిమీ తీస్తున్న అడల్ట్ సినిమాల్లో నటించడం అన్నది బాగా గమనించారు.
అయితే రోన్ జెరిమీ అలాంటి సినిమాలు తీయడం ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదించడం అక్కడ రాజకీయ నాయకుల తో మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల అతన్ని పట్టుకోవడానికి పోలీసులకి కొంచెం సవాలుగా మారింది… ఈ లోపు తన మీద పోలీసులు కన్నేశారు అని తెలుసుకున్న రోన్ జెరిమీ జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టారు.
అయితే రోన్ జెరిమీ దగ్గర చాలా సినిమాల్లో నటించిన ఒక 54 ఏళ్ల పెద్దావిడ ఒక సినిమాకు సంబంధించి రోన్ జెరిమీ తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వక పోవడంతో అతని మీద ధైర్యంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసింది… అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోలీసులు ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని రోన్ జెరిమీ నీ అరెస్టు చేసి తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు.
ఎప్పుడైతే రోన్ జెరిమీ నీ పోలీసులు అరెస్టు చేశారు అన్న విషయం బయటకు తెలిసిందో దాంతో తన బారినపడి సినిమాలు చేస్తూ తమ జీవితాలు నాశనం చేసుకున్న దాదాపు 200 మంది ఆడవాళ్ళు ధైర్యంగా పోలీసు దగ్గరికి వచ్చి అతను తన మీద చేసిన దౌర్జన్యాలను చెప్పారు… దాంతో బలమైన సాక్ష్యాధారాలు లభించడంతో పోలీసులు అతని మీద అన్ని కేసులు పెట్టి కోర్టులో హాజరు పరిచారు.
కోర్టులో రోన్ జెరిమీ తమ మీద చేసిన అయితే లని ఎలా తమ జీవితాన్ని నాశనం చేసింది అన్న విషయాలను కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉన్న ఎంతోమంది అమ్మాయిల నోటి నుంచి విని వారి కన్నీళ్లను డైరెక్టుగా చూసినా జడ్జి చలించిపోయాడు.
ఆయన లైంగికంగా వేధించిన వారిజాబితాలో 15 సంవత్సరాలనుంచి 54 సంవత్సరాల వయసున్నవారు ఉన్నారు. సుమారు 17మంది మహిళలు ఆయన మీద దారుణమయిన ఫిర్యాదు చేశారు. ఈనేరాలన్నింటిని ఆయన ఆయన 16 సంవత్సరాల వ్యవధిలో చేశాడని డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీసు ఒక ప్రకటన విడుదల చేసింది.
అడల్ట్ సినిమాలు పోర్న్ సినిమాలు బాగా చిత్రీకరణ జరుపుకునే అమెరికాలో రోన్ జెరిమీ కేసు ఒక పెను సంచలనం అయ్యింది… ఎంతోమంది అమాయకుల అనవసరంగా వలవేసి దీంట్లోకి లాగుతున్నారు అని వాళ్ళ జీవితాలు నాశనం కావడానికి ప్రత్యక్షంగా కారణం అవుతున్నారని ఇలాంటి ఇండస్ట్రీస్ మీద ఎంతో మంది మానవ హక్కుల సంఘాల నేతలు పోరాటం మొదలుపెట్టారు… దాంతో ఎన్నో సంవత్సరాల నుంచి అడల్ట్ సినిమా ఇండస్ట్రీలో చిక్కుకుపోయిన ఎంతోమంది మహిళలకు విముక్తి లభించింది.
జూన్ నుంచి ఆయన జైలులో ఉన్నాడు. 6.6 మిలియన్ డాలర్లు కడితేనే బెయిల్ వస్తుంది.అయితే, తాను అమాయకుడినిని చెబుతున్నాడు,ఈ ధీమాతో జూన్ 23న ట్వీట్ చేశాడు(పైన)