తెలంగాణ రాష్ట్రానికి వాటాగా, హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతున్నాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు.
జీఎస్టీ, ఐజీఎస్టీ, 14వ ఆర్థిక సంఘం నిధులు, కింద రాష్ట్రానికి 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన అన్నారు.
బకాయీల సంగతి అలా ఉంచితే ఇపుడు మొత్తం వ్యవసాయాన్ని లాగేసుకుని కార్పొరేట్, కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిన నాశనం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు.
సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన రాయపోల్ మధుసూదన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం ఉదయం మండలంలోని 266 మంది రైతులకు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి పట్టాదారు పాసు పుస్తకాలను, అధిక వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
“70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం మోదీ ప్రభుత్వం చెప్పాలి. అలాగే వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పోరేటికరణకు తెరలేపి నయా జమీందారు వ్యవస్థ తీసుకురావాలనుకుంటుననారు,’ అని హరీష్ రావు విమర్శించారు.
బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టి బిల్ కలెక్టర్లతో.. బిల్లు వసూళ్లకు పెడతారట. కరెంటు మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి, మీటర్లు వద్దనుకంటే మన కేసీఆర్ సారూ.. టీఆర్ఎస్ కారు పార్టీకే ఓటు వేయండి,’ అని ఆయన కోరారు.
‘టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, 6 ఏళ్లుగా రైతు కోసమే పని చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పై బాంబులు వేస్తున్నదని విమర్శించారు.
ఎకరానికి యేటా పెట్టుబడి సాయం కింద 10 వేల రూపాయలు సాయం చేస్తున్నది. ఈ విధంగా 28 రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా అంటూ మంత్రి ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ, రైతు ప్రభుత్వమని, బీజేపీ రైతు వ్యతిరేక చట్టాన్ని అమలు చేస్తున్న విధానం నచ్చక కేంద్రమంత్రి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపే ప్రభుత్వమని, 7 లక్షల ఆడ పిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని, ఆర్థిక సాయం కింద ఇప్పటి దాకా టు.5555 కోట్లు వెచ్చించినట్లు.. కరోనా విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. కానీ సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఓట్ల కోసం వచ్చేవారెవరో.. గుర్తించాలని కోరారు.
కొత్త పట్టాదారు పాసు పుస్తకాల కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారని, అయినా పాసు పుస్తకాలు పొందేవారు కారని, కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు మేలు కోసం సీఎం కేసీఆర్ తెచ్చారు.
1బీ కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతుల సమయం వృథా కావొద్దని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, 6 ఏళ్లుగా రైతు శ్రేయస్సు కోసం పని చేస్తున్నది.
కొత్త రెవెన్యూ చట్టంలో డిజిటల్ సర్వే చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, ట్రాక్టర్ ర్యాలీతో కొత్త రెవెన్యూ చట్టానికి ప్రతి గ్రామంలో స్వాగతిస్తున్నారు.
మండలంలోని 11, 317 ఖాతాలకు 10, 022 ఖాతాలు క్లియరెన్స్ చేసినట్లు వాటిలో ఇప్పటికే 9, 756 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసుకున్నామని, ఇవాళ 266 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
నాలా- ఎక్సెస్ ఎక్సేంట్ 550, కోర్టు తగదాలతో 350, ఈకేవైసీ-344, ప్రభుత్వ ల్యాండ్ ఖాతాలో 51 ఇలా మొత్తం క్లియరెన్స్ చేయని 1295 పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన క్లియరెన్స్ చేసి రైతులకు అందివ్వాలని ఆర్డీఓను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.