ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగస్ నేత, ఐఎన్ టియుసి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
1) తిరుమల తిరుపతి దేవస్థానంలో దీర్ఘకాలికంగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు, కార్మికులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి!
2) టీటీడీలో ఖాళీగా ఉన్న సుమారు 8వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి తిరుపతి రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించండి!
3) తిరుపతిలో”గరుడ వారధి” ఫ్లైఓవర్ పనులకు టీటీడీ నిధుల కేటాయింపులో మీనమేషాలు లెక్కిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరింత నిధులు సకాలంలో విడుదల చేసేలా త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చొరవ చూపండి!
4) కరోనా వైరస్ బాధితులకు “ఆరోగ్య శ్రీ” పథకం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని సీఎం హోదాలో ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు!
5) “స్విమ్స్’ క్యాజువాలిటీలో వున్న 30 పడకల కారణంగా బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దానిని100 పడకలకు పెంచేలా ఆదేశాలు ఇవ్వండి!! డాక్టర్ల సంఖ్య పెంచండి!! అదనపు క్యాజువాలిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించండి!!
6) “స్విమ్స్” స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి టీటీడీ 19 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్ కు ఇవ్వడంతో స్విమ్స్ లో పేషంట్లకు తగ్గట్టుగా పరికరాలను కొనుగోలు చేయలేక పోయారు!
7) “స్విమ్స్” అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి కేవలం “68 లక్షలు” మాత్రమే విడుదల చేస్తుంది దానిని “5 కోట్లకు” పెంచండి ప్రస్తుతం టీటీడీ ఇస్తున్న 5 కోట్లతో స్విమ్స్ నడుస్తుంది!
8) తిరుపతిలో “భూ బకాసురులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో దీర్ఘకాలికంగా తిష్టవేసి ఉన్న అవినీతి అధికారులను బదిలీ చేయండి తిరుపతి పవిత్రతను కాపాడండి!
(నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు,తిరుపతి)