జగన్ పాలనలో సుఖాలు వైసిపి నాయకులకు, దు:ఖాలు ప్రజలకు
(యనమల రామకృష్ణుడు)
రెండు ప్రధాన కారణాల వల్ల ఏపి ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది.అభివృద్ది పనులపై, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ప్రధాన కారణం. సాంఘిక ఆర్ధికాభివృద్దిపై తీవ్ర ప్రభావాన్ని ఇది చూపింది. కోవిడ్ 19 వైరస్ నియంత్రణపై నిర్లక్ష్యం చేయడం మరో ప్రధాన కారణం.
1986 అభివృద్ది హక్కులపై సార్వత్రిక ప్రకటనలో ఆర్టికల్ 1లో పేర్కొన్నదాని ప్రకారం అభివృద్ది హక్కు అంటే ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రాజకీయ రంగాల సమగ్రాభివృద్ది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం జిడిపిలో 24% తగ్గుదల ఉంటుంది, దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ జిఎస్ డిపిలో తగ్గుదల కూడా ఉంటుంది. అంటే ఏపి జిఎస్ డిపిలో రూ2,35,000కోట్లు తగ్గుదల ఉంటుంది. 2020-21 బడ్జెట్ అంచనాల్లో(బిఈ) ప్రముఖంగా ప్రస్తావించిన, 2019-20జిఎస్ డిపి అంచనాల ప్రకారం, మన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ రాబోయే ఆర్ధిక సంవత్సరంలో పెను ప్రమాదంలో పడనుందనేది ప్రతిఒక్కరికీ విదితం అవుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే కాదు, ఇదే స్థాయిలో కొంచెం అటుఇటుగా దాదాపు ఇతర ఏజెన్సీలన్నీ కూడా స్పష్టంగా చెప్పాయి.
అభివృద్ది పనులపై, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై సిఎం జగన్ నిర్లక్ష్యం
కోవిడ్ నియంత్రణపై నిర్లక్ష్యం చేయడం మరో కారణం
అభివృద్ది హక్కు అంటే ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రాజకీయ రంగాల సమగ్రాభివృద్ది
ఎస్ బిఐ అంచనాల ప్రకారం జిడిపిలో 24% తగ్గుదల
ఏపి జిఎస్ డిపిలో అదే స్థాయి 24% క్షీణతతో రూ 2,35,000కోట్ల తగ్గుదల
2020-21 జిఎస్ డిపి రూ 7,19,782కోట్లకు తగ్గిపోయే ప్రమాదం అంటే ఏపి జిఎస్ డిపి అవుట్ పుట్ లో మైనస్ 73%.
తలసరి ఆదాయం రూ40,648 తగ్గిపోయే అవకాశం. తలసరి ఖర్చులు, పొదుపు తగ్గిపోతాయి
పారిశ్రామిక రంగంలో క్షీణత 10.4%, సేవారంగంలో క్షీణత 15% దీనితో పెట్టుబడులు రావు, కొత్త పరిశ్రమల స్థాపన ఉండదు.
ఉన్న ఉద్యోగాలు పోయి, భవిష్యత్ లో ఉద్యోగాల కల్పన లేక యువతలో అశాంతి.
గత ఏడాది ఫస్ట్ క్వార్టర్ కు, ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ కు అప్పులు 363% పెరిగాయి.
పన్నులు పెంచి16నెలల్లోనే రూ20వేల కోట్ల పన్నులు వేశారు)
ఈ నివేదికల ప్రకారం 2020-21 ఫలితాలు ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి
1). జిఎస్ డిపి 2019-20సంవత్సరానికి రూ 9,72,782కోట్లు ( ఎస్ బిఐ అంచనాల ప్రకారం 24% తగ్గిస్తే) జిఎస్ డిపి 2020-21 సంవత్సరానికి రూ 7,19,782కోట్లు కాబట్టి ఏపి జిఎస్ డిపి అవుట్ పుట్ మైనస్ 73% ఉంటుంది. దీనితో రాష్ట్ర రాబడులు గణనీయంగా పడిపోతాయి.
2)తలసరి ఆదాయం పెరగడానికి బదులుగా తగ్గిపోతుంది. ఇదే దామాషాలో రూ40,648 తగ్గిపోతుంది. 2019-20లో రూ 1,69,515కు బదులుగా వాస్తవ పిసిఐ రూ 1,28,831 ఉంటుంది. పిసిఐ తగ్గుదల శాతం మైనస్ 76% ఉంటుంది. సామాన్యుల తలసరి ఆదాయం తగ్గిపోతే తలసరి ఖర్చు తగ్గుతుంది, పొదుపు ఉండదు, ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మరోవైపు తలసరి ఆదాయం తగ్గిపోయి వాళ్ల జీవితం దుర్భరంగా మారుతుంది
3)ఆహార ద్రవ్యోల్బణం 9.65%కు పెరుగుతుంది(2018-19లో మైనస్ 2.65%)
4) అప్పుల్లో 363% వృద్ది ఉంటుంది. 2019లో ఫస్ట్ క్వార్టర్ లో రూ9,342కోట్లు చేస్తే, 2020-21 ప్రథమ క్వార్టర్ కే రూ33,294కోట్లకు పెరిగాయి. అంటే 363% అప్పులు పెరిగాయి.
5)వడ్డీల చెల్లింపులు ఐదారు రెట్లు అధికంగా ఉంటుంది.
6)పారిశ్రామిక రంగంలో క్షీణత 10.4% దీనితో పెట్టుబడులు రావు, కొత్త పరిశ్రమల స్థాపన ఉండదు. ఉన్న ఉద్యోగాలు పోతాయి, భవిష్యత్ లో ఉద్యోగాల కల్పన ఉండదు.
7) సేవారంగంలో క్షీణత 15%
8)ఉపాధి లేకపోవడంతో యువతలో అశాంతికి దారితీస్తుంది
9)పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు.
10)తలసరి రుణం పెరిగిపోతుంది, తలసరి ఆదాయం తగ్గిపోతుంది.
11)ఫలితంగా తలసరి వ్యయం పడిపోతుంది అటు ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది, ఇటు సామాన్యులపై భారాలు పెరిగిపోయి జీవనం దుర్భరం అవుతుంది.
12)‘‘ఆర్ధికాభివృద్దికే అప్పులు తెచ్చుకోవాలి తప్ప అనుత్పాదక వ్యయానికి చేయకూడదని’’ ప్రముఖ ఆర్ధికవేత్త జాన్ కీన్స్ పేర్కొన్నారు. ‘‘ఉత్పాదక వ్యయంపై ఖర్చు చేస్తేనే రాబడులు పెరుగుతాయి, ఆర్ధికాభివృద్ది జరుగుతుందని’’ చెప్పారు.
13)జిఎస్ డిపిలో పన్నుల నిష్పత్తి 2% తగ్గుతుంది. (ఇప్పటికే ప్రజలపై పన్నులు మాత్రం పెంచేశారు. పన్నులు పెంచి16నెలల్లోనే రూ20వేల కోట్ల పన్నులు వేశారు).
15)ఎగుమతుల ప్రోత్సాహక ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ 21వ ర్యాంకుకు దిగజారింది.
16)జిడిపికి ఆంధ్రప్రదేశ్ వాటా 4% కి తగ్గిపోతుంది. ఓవరాల్ జిడిపిలో ఏపి స్థానం తగ్గిపోతుంది
17)జిఎస్ టి పరిహారం కింద అదనపు రుణం రూ 4,593కోట్లు రావాలి, తెచ్చే అప్పులకు ఇది అదనంగా చేరడం అగ్నికి ఆజ్యం అవుతుంది.
18)సహజ వనరులన్నీ వైసిపి నాయకుల దోపిడితో భవిష్యత్ లో రాష్ట్ర రాబడులు తగ్గిపోతాయి. శాండ్-ల్యాండ్ మాఫియా, మైన్-వైన్ మాఫియా
19) ద్రవ్య నిర్వహణ అనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టించుకున్న దాఖలాలు లేవు.
20)ఆర్ధిక వ్యవస్థ ఉద్దీపనకు ఎటువంటి ప్రణాళికలు లేవు. కరోనా నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రూ20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ఇచ్చింది. ఇతర రాష్ట్రాలు కేంద్రం ఇచ్చేదానికి అదనంగా రాష్ట్ర నిధులతో పేదలకు మేళ్లు.
కానీ ఏపిలో మాత్రం కోవిడ్ ప్రత్యేక సాయం లేకుండా ప్రజలపై పన్నుల భారం. ఇప్పటికే పన్నులు రూ20వేల కోట్లు వేశారు, అప్పులు విచ్చలవిడిగా రూ లక్షా 10వేల కోట్లు తెచ్చారు. వీటన్నింటి భారాలను అంతిమంగా ప్రజలపైనే మోపారు. వైసిపి చేతగాని తనంతో రాష్ట్రానికి చేటు, అవినీతితో అనర్ధం తెచ్చారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో సుఖాలు వైసిపి నాయకులకు, దు:ఖాలు ప్రజలకు…అందుకే దీనిని ‘‘జగన్ స్వామ్యం’’గా పేర్కొంది.
‘‘జగన్ కోసం, జగన్ కొరకు, జగన్ చేత’’ ప్రభుత్వమే తప్ప ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ప్రభుత్వం కాదు. రాష్ట్రాన్ని అన్నివిధాలా అధోగతి పాలు చేస్తున్న ఈ విధమైన పెడపోకడలను ఖండిస్తున్నాం.
(యనమల రామకృష్ణుడు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, ఆంధ్రప్రదేశ్)