(జి. నిరంజన్)
శుక్రవారంనాడు మల్కాజిగిరి నాలా లో పడి చనిపోయిన 12 యేళ్ల బాలిక సుమేధ కపూరియా మృతికి భాధ్యత వయిస్తూ మునిసిపల్ మంత్రి కె.టి.ఆర్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.
హైదరాబాద్ నగరములో వర్షము పడిందంటే ప్రజలు నరకము అనుభవిస్తున్నారు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే భయకంపితులవుతున్నారు.
కె.టి.ఆర్ అంకెల గారడీలతో, సమీక్షా సమావేశాలతో కాలము వెళ్లబుచ్చుతున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో ప్రజలకు మేలు జరిగి రక్షించే పనులు చేయడము లేదని ఈ సంఘటనతో స్పష్టమౌతుంది.
గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి జలమయమవుతున్నా, ప్రమాదము పొంచిఉన్న స్థలాలను గుర్తించి నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఈ భాధ్యత మంత్రిది, శాసన సభ్యులది, కార్పొరెేటర్లది, అధికారులది కాదా ?
గతములో ఇదే చోట ఒక మహిళ ప్రమాదానికి గురైనదని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు?
చిన్నారి సుమేధ తల్లి తండ్రుల కడుపు కోతకు ఎవరు భాధ్యులు?
నిర్లక్ష్యమునకు భాధ్యులుగా చేస్తూ సంబందిత మంత్రి, కె.టి.ఆర్, శాసన సభ్యుడు మైనం పల్లి, కార్పొరేటర్, అధికారుల పై క్రిమినల్ కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలి.
గత ఆరు సంవత్సరాలుగా అధికారము చలాయిస్తు భాద్యతను గత ప్రభుత్వాల పై నెట్టి వేస్తూ, నోటి దురుసు తనముతో మాట్లాడితే ప్రజలు సహించరు.
మొన్న 16 వ తేదీన అసెంబ్లీ లో కాంగ్రెస్ పక్ష నాయకుడు శ్రీ భట్టి విక్రమార్కను నోటి కొచ్చినట్టు విమర్శిస్తూ, కళ్లు కనపడటము లేదా? హైదరాబాద్ నగరము రోడ్లపై వెళ్తే అభివృద్ది మీ కంటికి కనపడటము లేదా అని ప్రశ్నించారు.
అదే రోజు భగవంతుడు కుంభవృస్టీ కురిపించి ఆరేళ్ళలో వారు చేసిన అభివృద్దిని, ప్రజల అవస్తలను ప్రపంచానికి చాటాడు. కొన్ని రోజులైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ కు టు లెట్ బోర్డ్ పెట్టే పరిస్థితి వస్తుందనే అహంకారముతో మాట్లాడారు.
మంత్రులు శాసన, శాసన మండలి సభ్యులు, కార్పోరేటర్ లు కె.సి.అర్, కె.టి.అర్ ల భజనతోనే కాలము వెల్లుబుచ్చు తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించు కోవడము లేదు.
ఎల్.అర్.ఎస్ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బు గుంజే యావ తప్ప ప్రజలకు రక్షణ కల్పించే శ్రద్ద కల్పించడము లేదు.
అకాల వర్షాలు, కరోనా నుండి ప్రజలను రక్షించటములో ఈ ప్రభుత్వము ఘొరముగా విఫలమైనది.
టి.అర్.ఎస్ మిత్ర పక్షమైన మజ్లిస్ పక్ష నాయకుడు శ్రీ అక్బరుద్దిన్ ఒవైసీ నగర అభివృద్దిపై కె.సి.అర్ ను మొన్న అసెంబ్లీలో విమర్శిస్తూ మీరు నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామన్నారు ఇప్పటికీ కలగానే మిగిలిందనడము వాస్తవ పరిస్థితికి అద్దము పడుతుంది.
(జి.నిరంజన్,ఎఐసిసి సభ్యులు,అధికార ప్రతినిధి,
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిట)