ఎంపిల్యాడ్స్ (MPLADS) బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ
రాష్ట్రం నుంచి గత టర్మ్ 16 వ లోక్ సభ, రాజ్యసభ లకు ప్రాతినిధ్యం వహించిన సభ్యుల ఎంపీ ల్యాడ్స్ బకాయి నిధులు రూ. 150 కోట్లు చెల్లించేందుకు బడ్జెట్ లో చిల్లిగవ్వ లేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈవిషయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు.
ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ లు వినోద్ కుమార్ శుక్రవారం లేఖ రాశారు.
కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో నివారణ కోసం భారీగా నిధులు అసరమవుతాయని చెబుతూ కేంద్ర క్యాబినెట్ ఏప్రిల్ నెలలో రెండేళ్ల పాటు MPLADS (Members of Paraliament Local Area Development Scheme) స్కీమ్ ను ఆపేయాలని నిర్ణయించింది. 2020-21,2021-22 సంవత్సరాలలో ఈ స్కీమ్ ఎంపిలకు అందుబాటులో ఉండదు.
Cabinet approves temporary suspension of MPLAD Fund of MPs during 2020-21 & 2021-22 for managing health& adverse impact of outbreak of #COVID19 in India. The consolidated amount of MPLAD Funds for 2 years – Rs 7900 crores – will go to Consolidated Fund of India: Prakash Javadekar pic.twitter.com/Suy20pFLQi
— ANI (@ANI) April 6, 2020