అంతర్వేది ఘటనలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాలపై దాడులు జరుగుతున్నందుకు నిరసన వ్యక్తం చేయడానికి బిజెపి చలో అమలాపురం పిలుపునిచ్చింది.
దాాడుల జరిగిన చోటికి వెళ్ళిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని దీనిపై ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఈ సంఘటలనకు నిరసనగా రేపు శుక్రవారం చలో అమలాపురానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల 5 పార్లమెంటులో ఉన్న బిజెపి నాయకులు ఉదయం 10 గంటలకల్లా తరలిరావాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
‘హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ వాటిమీద కేసుల నమోదు చేయకుండా ప్రభుత్వం తీరు ఉంది. గతంలో అంతర్వేది ఘటనలో అంతర్వేది వెళతారు అనే సమాచారం తో బిజెపి నాయకులను పోలీసుల గృహనిర్బంధం లో ఉంచారు. పోలీసులు కూడా సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్ప్పారు. పార్టీలపై అణచివేత చట్టాన్ని కఠినంగా ప్రయోగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని సోము వీర్రాజు అన్నారు.
అంతర్వేది ఘటనలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో చలో అమలాపురానికి పిలుపును ఇవ్వడం జరిగిందని సోము వీర్రాజు అన్నారు.